Bajaj Pulsar: కొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ 125, 150 లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. దేశీయ మార్కెట్లో కొత్త పల్సర్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. 125 సీసీ, 150 సీసీ సెగ్మెంట్లలో కొత్త మోడళ్లను తీసుకొచ్చింది. వీటిలో మోనోషాక్ సస్పెన్షన్, రైడ్ మోడ్‌లు, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ వంటి పలు కొత్త ఫీచర్లను జోడించింది. క్లాసిక్ పల్సర్ మోడళ్లలో వెనుకవైపు ఉండే డ్యూయల్‌షాక్ సస్పెన్షన్‌కు బదులుగా మోనోషాక్ సస్పెన్షన్‌ను అందించడం ఇదే తొలిసారి. దీంతోపాటు 'క్రాల్‌టెక్' అనే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ట్రాఫిక్‌లో పదేపదే థ్రాటిల్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా బైక్ నెమ్మదిగా ముందుకు కదిలేందుకు ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా ఇంజిన్ ఆగిపోకుండా చూస్తుంది.
వివరాలు
పల్సర్ 150 ఫీచర్లు
కొత్త పల్సర్ 150లోని ఇంజిన్ 13.6 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సింగిల్ డిస్క్, ట్విన్ డిస్క్ వేరియంట్లలో లభిస్తుంది.
సింగిల్ డిస్క్ వేరియంట్‌లో రోడ్, రెయిన్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను అందించారు.
దీంతోపాటు కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
ట్విన్ డిస్క్ వేరియంట్‌లో గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ సదుపాయంతో కూడిన 5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను ఇచ్చారు.
ఎల్‌ఈడీ ఇండికేటర్లు, హజార్డ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ కూడా ఇందులో ఉన్నాయి. కొత్త పల్సర్ 150ను సింగిల్ సీట్, స్పోర్టీ స్ప్లిట్ సీట్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
వివరాలు
పల్సర్ 125 ఫీచర్లు
పల్సర్ 125లోని ఇంజిన్ 11.7 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. బేస్ వేరియంట్‌లో కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ సదుపాయాలు ఉన్నాయి.
మిడ్, టాప్ వేరియంట్లలో రోడ్, రెయిన్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను అందించారు.
ఈ వేరియంట్లలో 5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేతోపాటు ఎల్‌ఈడీ ఇండికేటర్లు, హజార్డ్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను స్టాండర్డ్‌గా అందించారు. సింగిల్ సీట్, స్ప్లిట్ సీట్ ఆప్షన్లలో పల్సర్ 125 లభిస్తుంది.
వివరాలు
పల్సర్ 150 ధర
కొత్త పల్సర్ 150 ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.15 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1,15,233గా ఉంది.
ట్విన్ డిస్క్ సింగిల్ సీట్ వేరియంట్ ధర రూ.1,22,184 కాగా.. ట్విన్ డిస్క్ స్ప్లిట్ సీట్ వేరియంట్ ధర రూ.1,23,187గా కంపెనీ నిర్ణయించింది.
పల్సర్ 125 ధర
బజాజ్ పల్సర్ 125 మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. బేస్ వేరియంట్ ధర రూ.92,990గా ఉంది.
ఎస్‌టీడీ సింగిల్ సీట్ వేరియంట్ ధర రూ.99,291, ఎస్‌టీడీ స్ప్లిట్ సీట్ ధర రూ.1,00,288గా నిర్ణయించారు. ఇక ప్రీమియం స్ప్లిట్ సీట్ వేరియంట్ ధర రూ.1,04,318గా కంపెనీ పేర్కొంది.