Page Loader
భారతీయ మార్కెట్లోకి తిరిగి రానున్న బజాజ్ పల్సర్ 220 F ప్రారంభమైన బుకింగ్స్
భారతీయ మార్కెట్లోకి తిరిగి రానున్న బజాజ్ పల్సర్ 220 F

భారతీయ మార్కెట్లోకి తిరిగి రానున్న బజాజ్ పల్సర్ 220 F ప్రారంభమైన బుకింగ్స్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 17, 2023
06:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వదేశీ బైక్‌తయారీ సంస్థ బజాజ్ త్వరలో భారతదేశంలో లెజెండరీ పల్సర్ 220F మోడల్‌ బైక్ ను తిరిగి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది. అప్డేట్ అయిన ఈ బైక్ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల వద్దకు రావడం ప్రారంభించింది. డెలివరీలు ఒకటి లేదా రెండు వారాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బజాజ్ ఆటో సంస్థ 2007లో పల్సర్ 220F ప్రవేశపెట్టింది. అప్పట్లో ఇదే అత్యంత వేగమైన భారతీయ మోటార్‌సైకిల్ గా ప్రచారం జరిగింది. కంపెనీ 2021లో RS200కోసం ఈ బైక్‌ను నిలిపివేసింది. అయితే, ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌తో, మోటార్‌సైకిల్‌ను మళ్లీ పరిచయం చేస్తున్నారు.

బైక్

బజాజ్ పల్సర్ 220F ముందూ మోడల్ డిజైన్‌ లాగానే ఉంటుంది

బజాజ్ పల్సర్ 220F ముందూ మోడల్ డిజైన్‌ లాగానే ఉంటుంది. ఇది 220cc, "DTS-i" సింగిల్-సిలిండర్ ఇంజన్ తో నడుస్తుంది. రైడర్ భద్రత కోసం బజాజ్ పల్సర్ 220F మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం డ్యూయల్-ఛానల్ ABSతో పాటు ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. అప్డేట్ అయిన బజాజ్ పల్సర్ 220F ధర వివరాలను తయారీ సంస్థ త్వరలో ప్రకటిస్తుంది. ఈ భారతదేశంలో మోటార్‌సైకిల్ ధర సుమారుగా రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్).