Page Loader
సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో దర్శనమిచ్చిన చేతక్
సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో చేతక్ బజాజ్

సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో దర్శనమిచ్చిన చేతక్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 17, 2023
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

బజాజ్ చేతక్, ఒకప్పుడు ప్రతి మధ్య తరగతి ఇంట్లో ఉండేది. అయితే కైనెటిక్ జూమ్‌లు, హోండా యాక్టివా వంటి బ్రాండ్ల రాకతో అమ్మకాలలో వెనకపడింది. 2006లో చివరిగా చేతక్ విడుదలైంది. మళ్ళీ 16 సంవత్సరాల తరవాత ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో మార్కెట్లోకి రాబోతుంది. చేతక్‌లోని డిజిటల్ మీటర్ లో సైడ్ స్టాండ్ నోటిఫికేషన్ సమయం, బ్యాటరీ సూచనలు, స్పీడోమీటర్, ఓడోమీటర్‌తో పాటు రేంజ్ వంటి సమాచారం ఉంటుంది. స్కూటర్‌ ట్రెండీగా ఇంటిగ్రేట్ అయినా డిజిటల్ మీటర్ లో ఈ వివరాలు చూడటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బ్లూటూత్ కీ ఫీచర్ తో స్కూటర్‌ లాక్ చేయడం, అన్‌లాక్ చేయడం, మోటార్‌ స్టార్ట్ చేయడంవంటివి చెయ్యచ్చు.

స్కూటర్

మార్కెట్లో Ather, Ola, TVS వంటి బ్రాండ్లతో చేతక్ పోటీ పడుతుంది

ఇది జియో ఫెన్సింగ్, USB ఛార్జింగ్ పోర్ట్ మొబైల్ యాప్‌తో వస్తుంది, ఇందులో స్కూటర్ గురించి అన్ని వివరాలు ఉంటాయి. చేతక్ 4080W BLDC మోటారుతో 550.4 V/60.4 Ah లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది, ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేయడానికి 5 గంటలు పడుతుంది. చేతక్ టెక్నాలజీ లిమిటెడ్ పూర్తి ఛార్జ్‌తో 90-కిమీ వరకు నడుస్తుంది. స్పీడోమీటర్‌లో 40kmph మార్కును దాటిన తర్వాత స్కూటర్ ఆటోమెటిక్ గా స్పోర్ట్ మోడ్ మారుతుంది. స్కూటర్‌లో ఉపయోగించే కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు, ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుకవైపు డ్రమ్‌తో వస్తుంది. దీని రూ. 1,51,217 (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్) మార్కెట్లో Ather, Ola, TVS వంటి బ్రాండ్లతో పోటీ పడుతుంది.