Bajaj Pulsar NS400: మార్చిలో రానున్న బజాజ్ పల్సర్ NS400.. స్టన్నింగ్ ఫీచర్స్, ధర ఎంతంటే?
భారతదేశంలోని అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీదారులలో ఒకటైన బజాజ్ ఆటో, దాన్ని కొనసాగించేందుకు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ తీసుకొస్తోంది. ప్రస్తుతం బజాజ్ అదిరిపోయే ఫీచర్లను జోడించి 'పల్సర్ NS 400' పేరుతో సరికొత్త బైక్‌ను మార్కెట్లోకి తేనున్నారు . మరి, ఈ బైక్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. బజాజ్ పల్సర్ NS400 బైక్ ను బజాజ్ మార్చ్ లో తీసుకురానుంది. ప్రస్తుతం బజాజ్ తన పల్సర్ బైక్ లన్నింటిన్నీ బీఎస్6 మోడల్లో విడుదల చేస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం.. 'పల్సర్ NS 400' కూడా బీఎస్6 మోడల్‌గానే మార్కెట్లోకి వస్తోంది.
రాబోయే పల్సర్ NS400 డిజైన్, ఇంజన్ వివరాలు
పల్సర్ NS400బైక్.. బజాజ్ డొమినార్ 400 మాదిరిగానే 373.3సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉండేలా రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే 40 PS Power, 35NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పల్సర్ NS400 కొత్త 400cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ ద్వారా శక్తిని పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త తరం KTM 390 డ్యూక్, ట్రయంఫ్ స్పీడ్ 400లో కనుగొనబడింది. మొత్తం డిజైన్ ప్రస్తుతం ఉన్న పల్సర్ 250 శ్రేణిని పోలి ఉంటుంది. అయితే పెద్ద 400cc మిల్లుకు అనుగుణంగా మరింత గణనీయమైన శరీర నిష్పత్తులతో ఉంటుంది. లుక్ విషయానికి వస్తే స్పోర్టీ స్టైలింగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
ధర అంచనాలు,డెలివరీ టైమ్‌లైన్
ఇప్పటి వరకు మార్కెట్లోకి వచ్చిన పల్సర్ల కంటే.. రాబోయే పల్సర్ NS400 శక్తిమంతమైనదని, అధునాతనమైన స్పెసిఫికేషన్లు ఉన్నాయంటున్న నేపథ్యంలో ధర సుమారు రూ. 2 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. 2024 మార్చ్ లో ఈ బైక్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. డెలివరీలు ఏప్రిల్‌లో ప్రారంభమవచ్చు.