LOADING...
Bajaj Pulsar: జూలై అమ్మకాలలో బజాజ్‌ రికార్డు.. ఎవరు టాప్‌, ఎవరు డౌన్‌లో ఉన్నారంటే?
జూలై అమ్మకాలలో బజాజ్‌ రికార్డు.. ఎవరు టాప్‌, ఎవరు డౌన్‌లో ఉన్నారంటే?

Bajaj Pulsar: జూలై అమ్మకాలలో బజాజ్‌ రికార్డు.. ఎవరు టాప్‌, ఎవరు డౌన్‌లో ఉన్నారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2025
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ద్విచక్ర వాహన రంగంలో అగ్రగామిగా నిలిచిన 'బజాజ్ ఆటో లిమిటెడ్' వద్ద, బడ్జెట్‌కు సరిపడే CT100 నుంచి ప్రసిద్ధ పల్సర్ సిరీస్ వరకు అనేక మోడళ్లు ఉన్నాయి. అయితే, కంపెనీ మొత్తం అమ్మకాలు జూలై 2025లో క్షీణించాయి. ఈ నెలలో 1,30,077 యూనిట్లు విక్రయించగా, గతేడాది జూలై 2024లో 1,54,771 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే, సుమారు 16% తగ్గుదల నమోదైంది. ఇప్పుడు మోడల్ వారీగా అమ్మకాలు, వార్షిక మార్పులు ఎలా ఉన్నాయో చూద్దాం.

Details

పల్సర్ - బజాజ్‌కి ప్రధాన బలం 

బజాజ్‌లో అత్యధిక ఆదరణ పొందిన పల్సర్ సిరీస్ జూలై 2025లో కూడా టాప్‌లో నిలిచింది. ఈ నెలలో 79,812 యూనిట్లు అమ్ముడయ్యాయి. కానీ జూలై 2024లో ఈ సంఖ్య 95,789 యూనిట్లు. అంటే అమ్మకాలు దాదాపు 16.67% తగ్గాయి. అయినప్పటికీ, పల్సర్ ఇప్పటికీ కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా కొనసాగుతోంది రెండో స్థానంలో స్థిరంగా ప్లాటినా జూలై 2025లో ప్లాటినా అమ్మకాలు 29,424 యూనిట్లు, గతేడాది ఇదే నెలలో ఉన్న 28,927 యూనిట్లతో పోలిస్తే దాదాపు 1.72% వృద్ధి చూపాయి. తక్కువ ధర, అధిక మైలేజీ కారణంగా ఈ మోడల్ బడ్జెట్ సెగ్మెంట్ వినియోగదారుల్లో ఇంకా బలమైన స్థానాన్ని సంపాదించింది.

Details

చేతక్ EV  కి భారీ డిమాండ్

బజాజ్ తయారు చేసిన ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్, జూలై 2025లో 11,584 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది. అయితే గతేడాది జూలై 2024లో దీని అమ్మకాలు 20,114 యూనిట్లు కాగా, ఈసారి 42% తగ్గుదల నమోదైంది. నిపుణుల అంచనా ప్రకారం EV మార్కెట్లో పోటీ పెరగడం, అలాగే అధిక ధర వల్లే ఈ తగ్గుదల వచ్చింది. బజాజ్ CT - గ్రామీణ మార్కెట్లో తగ్గిన డిమాండ్ కంపెనీ చౌకైన మోడల్ బజాజ్ CT, జూలై 2025లో 4,722 యూనిట్లను మాత్రమే విక్రయించింది. జూలై 2024లో ఈ సంఖ్య 5,476 యూనిట్లు. అంటే అమ్మకాలు దాదాపు 13.77% తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రసిద్ధి ఉన్నప్పటికీ, డిమాండ్‌లో తగ్గుదల కనిపిస్తోంది.

Details

బజాజ్ ఫ్రీడమ్ - టాప్ 5లో స్థానం 

బజాజ్ ఫ్రీడమ్, జూలై 2025లో 1,909 యూనిట్ల అమ్మకాలతో ఐదో స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు 1,933 యూనిట్లు, అంటే దాదాపు 1% స్వల్ప తగ్గుదల నమోదు అయింది. ఇతర మోడళ్లు టాప్-5కు బయటగా, జూలై 2025లో బజాజ్ అవెంజర్ 1,468 యూనిట్లు, డొమినార్ 1,153 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ రెండు మోడళ్లు కూడా 3-4% వార్షిక వృద్ధి సాధించాయి. మొత్తంగా, జూలై 2025లో బజాజ్ ఆటో మొత్తం అమ్మకాలు తగ్గినా, పల్సర్ తన నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక ప్లాటినా స్వల్ప వృద్ధి సాధించగా, చేతక్ EV, CT, ఫ్రీడమ్ మోడళ్లు తగ్గుదల చవిచూశాయి.