Bentley Torcal EV: బెంట్లీ టోర్కల్ EV బ్లాక్ ఎడిషన్ ... కేవలం 20 కార్లకే పరిమితం...ఎందుకంటే
ఈ వార్తాకథనం ఏంటి
లగ్జరీ ఆటో మొబైల్ కార్ల ప్రపంచంలో బెంట్లీ టోర్కల్ EV ఇప్పుడు మరో ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చింది. జపాన్‌కు చెందిన ప్రముఖ స్ట్రీట్‌వేర్ డిజైనర్ హిరోషి ఫుజివారాతో కలిసి రూపొందించిన ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ప్రపంచవ్యాప్తంగా కేవలం 20 కార్లకే పరిమితం చేశారు. ముల్లినర్ ప్రత్యేకంగా తయారు చేసిన ఈ మోడల్‌కు 'టోర్కల్ FRGMT కమిషన్' అనే పేరు పెట్టారు. పూర్తిగా బ్లాక్ థీమ్‌తో రూపొందించిన ఈ ఎస్‌యూవీని చూస్తే సాధారణ టోర్కల్‌తో పోలిస్తే ఇది ఎంత భిన్నంగా ఉందో వెంటనే అర్థమవుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తొలి కస్టమర్ టోర్కల్ డెలివరీకి ముందే ఈ ప్రత్యేక వెర్షన్‌ను బెంట్లీ పరిచయం చేసింది.
Details
నలుపు రంగులో మరింత దూకుడైన లుక్
ఈ ప్రత్యేక టోర్కల్ EVకి బెలూగా బ్లాక్ పెయింట్ ఇచ్చారు. ముందు భాగంలోని గ్రిల్, బెంట్లీ బ్యాడ్జ్‌లు కూడా నలుపు రంగులోనే ఉంటాయి.
22 అంగుళాల వోర్టెక్స్ వీల్స్ కూడా ఇదే థీమ్‌లో కనిపిస్తాయి. సాధారణ ఎలక్ట్రిక్ కార్లలో కనిపించే ఏరో డిస్క్‌లకు భిన్నంగా వీటిని పూర్తిగా ఫోర్జ్ చేసి, కార్బన్ ఫైబర్ ఇన్‌సర్ట్స్ జోడించారు.
బయట పెద్దగా హంగామా లేకుండా చిన్న చిన్న FRGMT బ్రాండింగ్ మాత్రమే కనిపిస్తుంది. ముందు ఫెండర్లపై చిన్న అక్షరాలతో పేరు, వెనుక భాగంలో FRGMT లోగో ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి.
Details
లోపల కూడా పూర్తిగా డార్క్ థీమ్
కారు లోపలికి వెళ్లినా బ్లాక్ థీమ్ కొనసాగుతుంది. ఇంపీరియల్ బ్లూ, బెలూగా బ్లాక్ రంగుల కలయికతో ఇంటీరియర్‌ను తీర్చిదిద్దారు.
క్రాస్ స్టిచింగ్, పియానో బ్లాక్ ఫినిషింగ్‌తో పాటు డోర్ ప్యానళ్లపై బెంట్లీ, FRGMT లోగోలను చిన్నగా పొందుపరిచారు.
ప్రత్యేకమైన ట్రెడ్‌ప్లేట్లు కూడా ఉన్నాయి. సాధారణ లగ్జరీ కారు తరహాలో మెరుపులు, భారీ డిజైన్ కంటే ఈ వెర్షన్‌లో సైలెంట్ లగ్జరీకి ప్రాధాన్యం ఇచ్చారు.
జపనీస్ స్ట్రీట్‌వేర్ డిజైన్ ప్రభావం కూడా ఇంటీరియర్‌లో కనిపిస్తుంది. అందుకే ఈ 20 కార్లు సాధారణ టోర్కల్ కంటే ప్రత్యేకంగా నిలవనున్నాయి.
Details
810 హెచ్‌పీ పవర్.. 20 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్
2028 టోర్కల్ EVలో 113kWh బ్యాటరీ ప్యాక్, 800V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్ ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్ 810 హెచ్‌పీ పవర్, 1,194Nm టార్క్ ఇస్తుంది.
టోర్కల్ S వెర్షన్‌లో లాంచ్ కంట్రోల్ సమయంలో పవర్ 876 హెచ్‌పీకి, టార్క్ 1,350Nmకి చేరుతుంది. సుమారు 2,700 కిలోల బరువున్నప్పటికీ టోర్కల్ S గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకన్లలో అందుకుంటుంది.
400kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సాయంతో బ్యాటరీని 10 నుంచి 80 శాతం వరకు 20 నిమిషాల్లోపు ఛార్జ్ చేయవచ్చని బెంట్లీ చెబుతోంది. అయితే ఈ 20 యూనిట్ల ధర, ఏ మార్కెట్లలో విక్రయిస్తారనే వివరాలు ఇంకా వెల్లడించలేదు.