రూ.49 లక్షలకు బీఎండబ్య్లూ కారు
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్య్లూ ఇండియాలో తన సేల్స్ పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇండియాలో మునిపెన్నడూ లేని విధంగా అత్యధిక కార్లను విక్రయించి, అధిక ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ప్రస్తుతం బీఎండబ్య్లూ ఇండియా, ఎక్స్ 2 స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ లో కొత్త వెరియంట్ ఎస్ డ్రైవ్ 18ఐ ఎంను స్పోర్ట్ ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 48.9లక్షలు (ఎక్స్-షోరూం)గా నిర్ధారించారు. కంపెనీ చెన్నై ప్లాంట్ లో ఈ కారును ఉత్పత్తి చేయనున్నారు.
జూన్ నుంచి కార్ల డెలివరీ
ఎస్ డ్రైవ్ 18ఐ ఎం స్పోర్ట్ లో 1499సీసీ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. జూన్ నుంచి కార్ల డెలివరీని ప్రారంభిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. వినియోగదారులు ఇష్టాలకు అనుగుణంగా బీఎండబ్య్లూ ఎక్స్ 1 కొత్త వేరియంట్ ను తీర్చిదిద్దనట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పవా వెల్లడించారు. అదే విధంగా ఎం స్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ ను సైతం తీసుకొచ్చినట్లు తెలియజేశారు.