ఊహించని ఫీచర్లతో హ్యుందాయ్ కెట్రా ఎన్‌లైన్
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ వచ్చే ఏడాది మార్చిలో ఇండియాలో అడుగుపెట్టనుంది.
ఈ కారు డిజైన్ , టెక్ ఆధారిత సౌకర్యాలతో బ్లాక్-అవుట్ క్యాబిన్‌ను కలిగి ఉంది. హుడ్ కింద, ఇది 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో గరిష్టంగా 158hp శక్తిని విడుదల చేస్తుంది.
క్రెటా N లైన్ భారతదేశంలో i20 N లైన్, VENUE N లైన్ తర్వాత హ్యుందాయ్ మూడోవ N లైన్ మోడల్ విడుదలవుతోంది. ఇది 2024లో ఫేస్‌లిఫ్ట్ క్రెటాపై ఆధారపడి ఉంటుంది.
ఈ కారు కొనుగోలుదారులను ఆకర్షించేలా స్టైలిష్ లుక్స్, గొప్ప పనితీరును అందించే అవకాశం ఉంది.
Details
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ధర ఎంతో తెలుసా!
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ పొడవాటి హుడ్, పెద్ద గ్రిల్, సొగసైన LED హెడ్‌లైట్‌లు, ముందర భాగంలో బంపర్‌పై ఫాక్స్ బ్రష్డ్ అల్యూమినియం బిట్‌లతో కూడిన ఎరుపు రంగులను కలిగి ఉంటుంది.
ఇది ORVMలు, సైడ్ స్కర్ట్‌లు, 'N లైన్' బ్యాడ్జ్‌లు, స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌తో ఉంటుంది. షార్క్-ఫిన్ యాంటెన్నా, రేక్డ్ విండ్‌స్క్రీన్, ర్యాప్-అరౌండ్ టెయిల్‌ల్యాంప్‌లు, ట్వీక్డ్ బంపర్ వెనుక భాగంలో అందుబాటులో ఉంటాయి. ఇందులో ఎన్ లైన్-నిర్దిష్ట గేర్ లివర్, రెడ్ స్టిచింగ్‌తో కూడిన మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, USB ఛార్జర్‌లు ఉంటాయి.
ఇండియాలో హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ జనవరి 2024 నాటికి దీని ధర రూ. రూ. 10.87 లక్షలు ఉండనుంది.