Page Loader
BMW iX1 : భారత్ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ తొలి లగ్జరీ ఈవీ కారు.. సింగిల్ ఛార్జ్‌తో 440 కి.మీ ప్రయాణం
భారత్ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ తొలి లగ్జరీ ఈవీ కారు.. సింగిల్ ఛార్జ్‌తో 440 కి.మీ ప్రయాణం

BMW iX1 : భారత్ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ తొలి లగ్జరీ ఈవీ కారు.. సింగిల్ ఛార్జ్‌తో 440 కి.మీ ప్రయాణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2023
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఎండబ్ల్యూ అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తోంది. తాజాగా ఐఎక్స్1 (iX 1) పేరుతో మరో ఫీచర్ రిచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఆ కంపెనీ నుంచి ఇండియాలో లాంచ్ అయిన తొలి ఎలక్ట్రికల్ ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం బుకింగ్స్ కొన్ని గంటల్లోనే అయిపోవడం గమనార్హం. ఈ కారు డెలవరీలు అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ EVకి లభించిన ఆదరణ చూసి BMW ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా అశ్చర్యానికి గురయ్యాడు. సింగిల్ ఛార్జ్ తో 440 కిలోమీటర్ల ప్రయాణించనుంది. భారతీయ లగ్జరీ విభాగంలో పెట్రోల్, డీజల్ ఎలక్ట్రిక్‌తో సహా మల్టీ డ్రైవ్ ట్రైన్ లను అందించిన మొదటి కారుగా చెప్పొచ్చు.

Details

 ఐఎక్స్ లో అధునాతన ఫీచర్లు

కొత్త ఐఎక్స్ లో 5వ జనరేషన్ బీఎండబ్ల్యూ ఈ డ్రైవ్ టెక్నాలజిని కలిగి ఉంది. 313hp మిశ్రమ శక్తిని, 494 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్టంగా 180kmph వేగంలో 5.6 సెకన్లలోనే 0 నుండి వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ వెహికల్ బ్యాటరీ కేవలం 6.3 గంటల్లోనే వందశాతం చార్జ్ అవుతుంది. ఇప్పటికే 35 నగరాల్లో బీఎండబ్ల్యూ డీలర్ నెట్ వర్క్ లో ఫాస్ట్ ఛార్జర్ లను కలిగి ఉంది. ఈ వెహికల్ బ్యాటరీలు 8 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు వ్యాలీడ్ అయ్యే వారంటీతో రానున్నాయి. ఈ కారులో 18-అంగుళాల M అల్లాయ్ వీల్స్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం 10.7-అంగుళాల కర్వ్ డిస్‌ప్లే, 10.25-అంగుళాల కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉన్నాయి.