Loading...
BMW: చైనా మార్కెట్ కోసం బీఎండబ్ల్యూ లాంగ్-వీల్‌బేస్ X5, ఎలక్ట్రిక్ iX5 ఎస్‌యూవీలు ఆవిష్కరణ
చైనా మార్కెట్ కోసం బీఎండబ్ల్యూ లాంగ్-వీల్‌బేస్ X5, ఎలక్ట్రిక్ iX5 ఎస్‌యూవీలు ఆవిష్కరణ

BMW: చైనా మార్కెట్ కోసం బీఎండబ్ల్యూ లాంగ్-వీల్‌బేస్ X5, ఎలక్ట్రిక్ iX5 ఎస్‌యూవీలు ఆవిష్కరణ

వ్రాసిన వారు Moogati Shabari
Jul 27, 2026
09:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) తన కొత్త తరం X5, పూర్తి ఎలక్ట్రిక్ iX5 ఎస్‌యూవీల లాంగ్-వీల్‌బేస్ (Long Wheelbase) వెర్షన్లను అధికారికంగా పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ రెండు మోడళ్లను ప్రత్యేకంగా చైనా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసింది. ఈ వాహనాలు బీఎండబ్ల్యూ అభివృద్ధి చేసిన అత్యాధునిక Neue Klasse ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడ్డాయి. వీల్‌బేస్‌ను పొడిగించడం వల్ల వెనుక సీట్లలో ప్రయాణించే వారికి మరింత విశాలమైన స్థలం, మెరుగైన ప్రయాణ సౌకర్యం, అధిక రోడ్ స్టెబిలిటీతో పాటు మరింత ప్రీమియం లుక్‌ను అందించేలా డిజైన్ చేశారు. అయితే ఈ మోడళ్లను చైనా వెలుపల ఇతర దేశాల్లో కూడా విక్రయిస్తారా అనే విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు.

వివరాలు

3,165 మిల్లీమీటర్ల భారీ వీల్‌బేస్..

లాంగ్-వీల్‌బేస్ X5, iX5 మోడళ్లలో వీల్‌బేస్‌ను 130 మిల్లీమీటర్లు పెంచడంతో, మొత్తం పొడవు 3,165 మిల్లీమీటర్లకు చేరుకుంది.

ఈ మార్పు కారణంగా క్యాబిన్‌లో, ముఖ్యంగా వెనుక సీట్లలో ప్రయాణించే వారికి మరింత లెగ్‌రూమ్‌తో కూడిన విశాలమైన స్థలం లభిస్తుంది.

అదనపు పొడవు కారణంగా వాహనం పక్క నుంచి మరింత ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా, రోడ్డుపై మరింత బలమైన ప్రెజెన్స్‌ను కూడా కల్పిస్తుంది.

బాహ్య డిజైన్‌లో కూడా పలు మార్పులు చేశారు. కొత్త డయాగనల్ ఎల్‌ఈడీ లైటింగ్ సిగ్నేచర్, అలాగే కిడ్నీ గ్రిల్ సమీపంలో అదనపు లైట్ స్ట్రిప్‌లను అమర్చడం ద్వారా ముందు భాగానికి మరింత ఆధునికమైన, ఆకర్షణీయమైన లైటింగ్ ఎఫెక్ట్‌ను అందించారు.

వివరాలు

పూర్తిగా కొత్త పానోరమిక్ iDrive సిస్టమ్..

వాహనం లోపలి భాగాన్ని కూడా మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు.

క్యాబిన్‌లో క్లీనర్ లేఅవుట్, ఒకే రంగు ఆధారిత డిజైన్ థీమ్, నాణ్యమైన సర్ఫేస్ ఫినిషింగ్‌తో పాటు స్లేట్, గ్లాస్ వంటి ప్రీమియం మెటీరియల్స్‌ను ఉపయోగించారు.

ముందు, వెనుక సీట్లను కూడా కొత్తగా రూపొందించి ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పించారు.

అదనంగా, ఈ మోడళ్లలో BMW Operating System X ఆధారంగా పనిచేసే కొత్త Panoramic iDrive సిస్టమ్‌ను అందించారు.

ఫ్లోటింగ్ సెంట్రల్ టచ్‌స్క్రీన్‌తో పాటు, X5 సిరీస్‌లో తొలిసారిగా ప్రత్యేక ప్యాసింజర్ డిస్‌ప్లేను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

ADVERTISEMENT

వివరాలు

31.3 అంగుళాల థియేటర్ స్క్రీన్..

లాంగ్-వీల్‌బేస్ X5, iX5 ఎస్‌యూవీలలో 31.3 అంగుళాల Theatre Screenను అందించారు. ఇది 8K వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, వీడియో కాలింగ్ వంటి ఫీచర్లకు మద్దతు ఇస్తుంది.

ఈ ఫీచర్‌ను మొదటిసారిగా BMW 7 Seriesలో ప్రవేశపెట్టగా, అనంతరం కొన్ని మార్కెట్లలో విక్రయించే లాంగ్-వీల్‌బేస్ 5 Series Sedan మోడళ్లలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

అదే విధంగా, క్యాబిన్‌లో Panoramic Vision వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.

విండ్‌షీల్డ్‌పై సమాచారం ప్రొజెక్ట్ చేసే ఈ సిస్టమ్‌లో డ్రైవర్‌కు ఎదురుగా మూడు స్థిరమైన ఇన్ఫర్మేషన్ టైల్స్ ఉండగా, కుడివైపు అవసరానికి అనుగుణంగా మార్చుకునే ఆరు వరకు కస్టమైజ్ చేయగల విడ్జెట్‌లను ఏర్పాటు చేశారు.

ADVERTISEMENT

వివరాలు

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణం..

పూర్తిగా ఎలక్ట్రిక్ iX5 మోడల్‌లో బీఎండబ్ల్యూ ఆరో తరం eDrive సాంకేతికతను వినియోగించారు.

ఇందులో భారీ 141kWh బ్యాటరీ ప్యాక్ను అమర్చారు. చైనాలో అమల్లో ఉన్న CLTC టెస్ట్ సైకిల్ ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుందని సంస్థ వెల్లడించింది.

ఇక X5, iX5 రెండింటిలోనూ స్టాండర్డ్‌గా అడాప్టివ్ టూ-యాక్సిల్ ఎయిర్ సస్పెన్షన్ను అందించారు.

దీని వల్ల ప్రయాణ సమయంలో మరింత సౌకర్యం, మెరుగైన స్థిరత్వం లభిస్తాయి.

బీఎండబ్ల్యూ ఈ రెండు లాంగ్-వీల్‌బేస్ ఎస్‌యూవీలను 2027 ప్రారంభంలో చైనా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT