Page Loader
BMW Electric Car : అధునాతన ఫీచర్లతో బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎలక్ట్రిక్ కారు
అధునాతన ఫీచర్లతో బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎలక్ట్రిక్ కారు

BMW Electric Car : అధునాతన ఫీచర్లతో బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎలక్ట్రిక్ కారు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఎండబ్ల్యూ ఇండియా తన కొత్త బీఎండబ్ల్యూ కారు ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారుకి ధర రూ.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు చెన్నై యూనిట్‌లో రూపొందించారు. eDrive20L డ్రైవ్‌ట్రైన్‌తో, ఈ బీఎండబ్ల్యూ ఎక్స్1 కారు 2025 ద్వితీయార్థంలో డెలివరీలు చేయనున్నారు. బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎలక్ట్రిక్ కారు 531 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఇది సిటీ కమ్యూటింగ్, లాంగ్ జర్నీల కోసం డిజైన్ చేశారు. ఇది ఎక్కువ స్థలాన్ని, సౌకర్యాన్ని అందిస్తుంది.

Details

 స్మార్ట్ ఇ-రూటింగ్ ఫీచర్ 

ఈ కారు 66.4 kWh బ్యాటరీతో, eDrive టెక్నాలజీ ఆధారంగా వస్తుంది. ఇందులో సరికొత్త iDrive సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో స్మార్ట్ ఇ-రూటింగ్ ఫీచర్ ఉంది. బ్యాటరీ స్థాయిల ఆధారంగా ఛార్జింగ్ స్టాప్‌లను ఆప్టిమైజ్ చేయడంలో సాయపడుతుంది. కేవలం 29 నిమిషాల్లో 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగల 130 kW DC ఛార్జర్‌తో ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేయనుంది. ఈ కారు ఆధునిక ఫీచర్లతో కూడిన విశాలమైన క్యాబిన్‌ను అందిస్తుంది. ఇందులో మల్టీ-వే అడ్జస్టబుల్ స్పోర్ట్స్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Details

స్మార్ట్ వాచ్ తో కారును లాక్ చేసే అవకాశం

ఈ బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కారు డిజిటల్ కీ ప్లస్‌తో సరికొత్తగా అమర్చారు. దీని ద్వారా కారు ఓనర్ తమ స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్‌ను ఉపయోగించి కారు లాక్ చేయడం, అన్‌లాక్ చేయడం, స్టార్ట్ చేయడం సులభమవుతుంది. ఇందులో లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, ఆటోమేటిక్ పార్కింగ్ ఫంక్షన్‌ల వంటి డ్రైవర్ అసిస్ట్ ఫీచర్లను కూడా అందిస్తుంది. బీఎండబ్ల్యూ ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఎలక్ట్రిక్ కారు మినరల్ వైట్, కార్బన్ బ్లాక్ వంటి డ్యూయల్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ కారుకి రెండు సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ వారంటీ కూడా అందించనున్నారు.