Page Loader
Best Electric Cars 2024: పెట్రో-డీజిల్‌ ధరలు పెరగడంతో.. ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఆసక్తి.. 10లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే.. 
పెట్రో-డీజిల్‌ ధరలు పెరగడంతో.. ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఆసక్తి.. 10లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే..

Best Electric Cars 2024: పెట్రో-డీజిల్‌ ధరలు పెరగడంతో.. ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఆసక్తి.. 10లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2024
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో, వాహనదారులకు ఇది పెద్ద భారంగా మారింది. అందువల్ల, వారు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను అన్వేషిస్తున్నారు. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో, చాలామంది కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే, బడ్జెట్ రూ. 10 లక్షల వరకు మాత్రమే ఉంటే, ఈ కార్లు బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు.

వివరాలు 

Tata Tiago EV ధర: 

టాటా మోటార్స్‌కు చెందిన టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు ధర రూ. 7,99,000 (ఎక్స్‌షోరూం) నుండి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 11,49,000 (ఎక్స్‌షోరూం). ఈ కారు పూర్తిగా ఛార్జింగ్ చేసుకున్నప్పుడు 275 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలదు. 0 నుండి 60 కి స్పీడ్ చేరుకోవడానికి 5.7 సెకన్లు పడుతుంది. MG Windsor EV ధర: చైనాకు చెందిన ఎంజీ మోటార్‌కు చెందిన ఎలక్ట్రిక్ కారు MG విండ్సోర్‌ EV, ధర రూ. 9,90,000 (ఎక్స్‌షోరూం)నుండి ప్రారంభమవుతుంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే సుమారు 331 కిలోమీటర్లు ప్రయాణించగలదు.ఈ కారు సింగిల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ను అమర్చారు,ఇది 38 కిలోవాట్స్‌ బ్యాటరీ ప్యాక్‌ ఆధారంగా పనిచేస్తుంది. అక్టోబర్ 12 నుంచి డెలివరీలు ప్రారంభమయ్యాయి.

వివరాలు 

TATA Punch ధర: 

టాటా పంచ్‌ ప్రారంభ ధర రూ. 9,99,000 (ఎక్స్‌షోరూం) నుండి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 14,29,000 (ఎక్స్‌షోరూం)గా ఉంది. పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు, 365 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ చేయగలదు. ఈ కారు 0 నుండి 100 కి వేగవంతం కావడానికి 9.5 సెకన్లు పడుతుంది. MG Comet ధర: ఎంజీ కామెట్‌ ధర రూ. 6,99,000 (ఎక్స్‌షోరూం) నుండి మొదలవుతుంది. ఇందులో 17.3kWh లిథియం ఐయాన్‌ బ్యాటరీని ఉపయోగించారు. సింగిల్ ఛార్జ్‌తో 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 0-100 శాతం ఛార్జింగ్‌కు 7 గంటల సమయం పడుతుంది. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణానికి కేవలం రూ. 519 మాత్రమే అవుతుందని కంపెనీ తెలిపింది.