BYD Celian 7: భారతదేశంలో ప్రారంభమైన బీవైడీ.. సీలియన్ 7.. 567km రేంజ్.. ధరెంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ తాజాగా సీలియన్ 7(BYD Sealion 7)అనే విద్యుత్ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది.
ఈ మోడల్ ప్రారంభ ధరను కంపెనీ రూ.48.90 లక్షలుగా నిర్ణయించగా,హైఎండ్ వేరియంట్ ధర రూ.54.90 లక్షలుగా ఉంది.
ఈ కారు బుకింగ్ కోసం కస్టమర్లు రూ.70,000 చెల్లించాలి.ఇప్పటివరకు,బీవైడీ భారత మార్కెట్‌లో అట్టో, ఈమ్యాక్స్ 7,సీల్ అనే మూడు కార్లను ప్రవేశపెట్టింది.
సీలియన్ 7 ఈ బ్రాండ్ నుండి నాలుగో మోడల్.ఈ ఎస్‌యూవీ ముందు భాగం,గతంలో విడుదల చేసిన సీల్ సెడాన్ డిజైన్‌ను పోలి ఉంటుంది.
ఫీచర్ల పరంగా చూస్తే,సీలియన్ 7లో 10.25అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు.
వివరాలు
RWD వేరియంట్ సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్
అదనంగా, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అత్యాధునిక ADAS ఫీచర్లు, 12 స్పీకర్ల సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియమ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ ఎస్‌యూవీ 82.56 కిలోవాట్-అవర్ బ్యాటరీతో అందుబాటులో ఉంది.దీంట్లో RWD, AWD అనే రెండు వేరియంట్లు లభిస్తున్నాయి.
RWD వేరియంట్ సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది, ఇది 308 హెచ్‌పీ పవర్, 380 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
AWD వెర్షన్‌లో మోటార్ 523 హెచ్‌పీ పవర్, 690 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది.
బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే, RWD మోడల్ ఫుల్ ఛార్జింగ్‌తో 567 కిలోమీటర్ల రేంజ్, AWD వేరియంట్ 542 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.