India passenger car sales: ఆగస్టులో కార్ల అమ్మకాలు 41% జంప్.. భారత ఆటో రంగానికి బూస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆటో మొబైల్ పరిశ్రమలో ఆగస్టు నెలలో హోల్‌సేల్ వాహన విక్రయాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెల్లడిస్తున్నాయి. బలమైన డిమాండ్ కారణంగా వివిధ వాహన విభాగాల్లో అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నోమురా అంచనాల ప్రకారం.. మొత్తం ప్యాసింజర్ వెహికల్ (PV) హోల్‌సేల్ వాల్యూమ్స్ ఏడాది ప్రాతిపదికన (YoY) ఏకంగా 41 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో టూ-వీలర్ విక్రయాలు 11 శాతం, మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ (M&HCVs) విక్రయాలు 25 శాతం పెరిగే అవకాశం ఉందని నోమురా అంచనా వేసింది.
వివరాలు
ఈవీ విభాగంలో భారీ వృద్ధి
ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగం కూడా ఆగస్టులో గణనీయమైన వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ (e2W) విక్రయాలు ఏకంగా 57 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి.
ప్యాసింజర్ వాహనాల విభాగంలో ఈవీల వాటా 7 శాతాన్ని దాటే అవకాశం ఉంది. టూ-వీలర్ విభాగంలో ఈవీల వాటా 10 శాతానికి చేరుతుందని అంచనా.
భారతదేశం స్థిరమైన రవాణా పరిష్కారాల వైపు మారుతున్న క్రమంలో ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
వివరాలు
టూ-వీలర్ విభాగంలో TVS ముందంజ
టూ-వీలర్ విభాగంలో TVS Motor Company అత్యధిక వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. కంపెనీ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 28 శాతం పెరిగే అవకాశం ఉందని నోమురా అంచనా వేసింది.
గతేడాది ఆగస్టులో 5.10 లక్షల యూనిట్లుగా ఉన్న TVS విక్రయాలు.. ఈ ఏడాది ఇదే కాలంలో 6.53 లక్షల యూనిట్లకు పెరిగే అవకాశం ఉంది.
ఇక బజాబ్ ఆటో విక్రయాలు 17 శాతం, రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయాలు 10 శాతం, హీరో మోటార్‌కార్ప్ విక్రయాలు 7 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి.
వివరాలు
ప్యాసింజర్ వెహికల్స్‌లో టాటా మోటార్స్ టాప్
ప్యాసింజర్ వెహికల్ విభాగంలో 'టాటా మోటార్స్' అత్యధిక వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. కంపెనీ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన ఏకంగా 62 శాతం పెరిగే అవకాశం ఉందని నోమురా అంచనా వేసింది.
గతేడాది ఆగస్టులో 0.43 లక్షల యూనిట్లుగా ఉన్న టాటా మోటార్స్ విక్రయాలు.. ఈ ఏడాది 0.70 లక్షల యూనిట్లకు చేరే అవకాశం ఉంది.
మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో విక్రయాలు 40 శాతం, మారుతీ సుజుకీ విక్రయాలు 36 శాతం, హ్యుందాయ్ విక్రయాలు 16 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెల్లడిస్తున్నాయి.
వివరాలు
కమర్షియల్ వెహికల్స్‌లో ఆశోక్ లైల్యాండ్, టాటా మోటార్స్ జోరు
కమర్షియల్ వెహికల్ విభాగంలో కూడా అమ్మకాలు బలంగా ఉండే అవకాశం ఉంది.
ఆశోక్ లైల్యాండ్ విక్రయాలు 31 శాతం, టాటా మోటార్స్ విక్రయాలు 30 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా. అదేవిధంగా M&M ట్రాక్టర్ విక్రయాలు 6 శాతం వృద్ధి చెందే అవకాశం ఉంది.
ఈ అంచనాలు ఆగస్టులో కమర్షియల్ వెహికల్స్‌కు డిమాండ్ బలంగా ఉన్నట్లు సూచిస్తున్నాయి.
వివిధ వాహన విభాగాల్లో అమ్మకాలు పెరగడం భారత ఆటోమొబైల్ పరిశ్రమకు మరింత ఊతమివ్వనుందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి.