LOADING...
Citroen Aircross Comfort: రూ. 9.09 లక్షల ధరతో భారత మార్కెట్లోకి సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్
రూ. 9.09 లక్షల ధరతో భారత మార్కెట్లోకి సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్

Citroen Aircross Comfort: రూ. 9.09 లక్షల ధరతో భారత మార్కెట్లోకి సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్

వ్రాసిన వారు Moogati Shabari
Jun 24, 2026
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

సిట్రోయెన్ ఇండియా తన ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీకి కొత్త కంఫర్ట్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. క్యాబిన్ అనుభవాన్ని మరింత మెరుగుపరచే లక్ష్యంతో ఈ ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 9.09 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు. ఎంట్రీ-లెవల్ 'యూ' వేరియంట్ ఆధారంగా రూపొందించిన ఈ ఎడిషన్‌కు రూ. 20,000 అదనపు ధర ఉంది. అలాగే మిడ్-స్పెక్ 'ప్లస్' ట్రిమ్‌లో ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండానే అందుబాటులో ఉంటుంది. టర్బో-పెట్రోల్ వెర్షన్ ధర రూ. 11.99 లక్షల వరకు ఉంటుంది.

వివరాలు

ఆ ఫీచర్ వల్ల ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు..

సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణగా అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్‌గా లెదరెట్ సీట్ అప్హోల్స్టరీను అందించారు. సాధారణంగా ఈ సెగ్మెంట్‌లో ఉన్నత వేరియంట్‌లలో మాత్రమే కనిపించే ఈ ఫీచర్ వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యం లభించడంతో పాటు క్యాబిన్ నాణ్యత కూడా మెరుగ్గా అనిపించనుంది. తక్కువ ధరలోనే ప్రీమియం క్యాబిన్ అనుభవాన్ని అందించాలన్న సిట్రోయెన్ లక్ష్యానికి అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది. అప్హోల్స్టరీ అప్‌గ్రేడ్‌తో పాటు వెనుక సీట్ల ప్రయాణికుల కోసం హైట్ అడ్జస్టబుల్ రియర్ హెడ్‌రెస్ట్స్ను కూడా జోడించారు.

వివరాలు

యూ ప్యాక్ టెక్నాలజీ..

దీంతో వెనుక కూర్చునే వారికి మరింత సౌకర్యం లభించనుంది. అంతేకాకుండా క్యాబిన్‌లో మెరుగైన సాఫ్ట్-టచ్ మెటీరియల్స్‌ను ఉపయోగించడం వల్ల ఇంటీరియర్ మరింత ప్రీమియంగా కనిపించనుంది. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అదనపు ఖర్చు లేకుండానే ఎక్కువ కంఫర్ట్ కోరుకునే కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఈ మార్పులు తీసుకొచ్చారు. కంఫర్ట్ ఎడిషన్‌తో పాటు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మూడు ఐచ్ఛిక యాక్సెసరీ ప్యాకేజీలను కూడా సిట్రోయెన్ అందిస్తోంది. వీటిలో 'యూ ప్యాక్' టెక్నాలజీ, స్టైలింగ్ అప్‌గ్రేడ్‌లపై దృష్టి సారిస్తుంది. ఇందులో 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్‌తో పాటు కొన్ని ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ అంశాలు ఉన్నాయి.

Advertisement

వివరాలు

వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్..

అలాగే 'ప్లస్ ప్యాక్' ఎంపిక చేసుకునే వారికి వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్లు లభిస్తాయి. క్యాబిన్ ఎంటర్‌టైన్‌మెంట్, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే వారి కోసం 'మ్యాక్స్ ప్యాక్' అందుబాటులో ఉంది. ఇందులో జేబీఎల్ ఆడియో సిస్టమ్‌తో పాటు డ్రైవర్ అసిస్టెన్స్ అలర్ట్‌లతో కూడిన మూడు-చానల్ డ్యాష్‌క్యామ్‌ను అందిస్తున్నారు. కొత్త కంఫర్ట్ ఎడిషన్ ద్వారా పోటీ ఎక్కువగా ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఎయిర్‌క్రాస్ విలువను మరింత పెంచాలని సిట్రోయెన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అప్‌డేట్‌లో యాంత్రిక మార్పుల కంటే ప్రయాణికుల సౌకర్యంపై ఎక్కువ దృష్టి పెట్టారు. దీంతో రోజువారీ వినియోగానికి మరింత కంఫర్ట్‌ను అందించే ఎస్‌యూవీగా ఎయిర్‌క్రాస్‌ను నిలబెట్టేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.

Advertisement