
Cars registrations: తెలంగాణలో కార్ల రిజిస్ట్రేషన్లలో తగ్గుదల.. ఆదాయ వృద్ధిలో వెనుకబడిన రవాణా శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రవాణా శాఖ లక్ష్యాన్ని సాధించడంలో వెనుకబడింది.
గత ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయం పెరుగుతుండగా, ఈ సారి మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
పొరుగు రాష్ట్రాలు 8-32% మధ్య వృద్ధిని సాధించినా తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరంలో రవాణా ఆదాయం తగ్గిపోతుంది. ఈ తగ్గుదలకు కార్ల అమ్మకాలు, వాహన రిజిస్ట్రేషన్లు తగ్గడం ప్రధాన కారణంగా గుర్తించారు.
ప్రస్తుతం, రాష్ట్ర రవాణా శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.8,478 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా, నవంబర్ 20 నాటికి రూ.4,389 కోట్ల ఆదాయం పొందింది.
మిగిలిన 4 నెలల్లో మిగిలిన రూ.4,089 కోట్లు సాధించడం కష్టంగా కనిపిస్తోంది. అయినా అధికారుల అభిప్రాయం ప్రకారం జనవరిలో పుంజుకునే అవకాశాలు ఉన్నాయట.
Details
లైఫ్ ట్యాక్స్ నుండి 72శాతం ఆదాయం
రాష్ట్రంలో ఆదాయం పెరగడానికి సాధారణంగా కార్లు, ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు, కొనుగోళ్లతో పాటు లైఫ్ ట్యాక్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రస్తుతం వచ్చిన మొత్తం ఆదాయంలో 72% లైఫ్ ట్యాక్స్ నుండి వచ్చింది. అలాగే ఆటోలు, బస్సుల వంటి వాణిజ్య వాహనాల నుంచి ఆదాయం త్రైమాసిక పన్నులతో వస్తోంది.
పొరుగు రాష్ట్రాలలో తమిళనాడు 32% వృద్ధితో అత్యధికంగా ఉన్నా తెలంగాణలో క్షీణత కారణంగా వృద్ధి శాతం మైనస్‌లో ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రియల్ ఎస్టేట్ రంగం మందగమనంతో వాహనాల కొనుగోళ్లలో కూడా తగ్గుదల ఏర్పడింది.