Page Loader
Lamborghini Urus : లంబోర్గిని ఉరుస్ హైబ్రిడ్ వెర్షన్ వచ్చేసింది.. ధర చూస్తే మతిపోద్ది!
లంబోర్గిని ఉరుస్ హైబ్రిడ్ వెర్షన్ వచ్చేసింది.. ధర చూస్తే మతిపోద్ది!

Lamborghini Urus : లంబోర్గిని ఉరుస్ హైబ్రిడ్ వెర్షన్ వచ్చేసింది.. ధర చూస్తే మతిపోద్ది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 10, 2024
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటలీ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్గిని'కి మార్కెట్లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి ఎక్స్‌పెన్సివ్ కారులో తిరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తాజాగా ఆ సంస్థ ఎస్‌యూవీ మోడల్ ఉరుస్‌‌లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ ను విపణిలోకి రిలీజ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.4.57 కోట్లు (ఎక్స్-షోరూం) గా నిర్ణయించారు. ఈ వెహికల్‌ని ఒక్కసారి ఛార్జింగ్‌తో 60 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. కేవలం 3.4 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ వెహికల్ ప్రత్యేకత

Details

వచ్చే ఏడాది నుంచి డెలవరీలు

ఉరుస్ ఎస్ఈ మోడల్‌లో అమర్చిన ట్విన్ టర్బో 4.0 వీ8 టర్బో పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్‌తో కలిసి పనిచేయనుంది. ఇందులో 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను అమర్చారు. వచ్చే ఏడాది నుంచి కొనుగోలుదార్లకు ఈ కార్ల డెలవరీలు అందించనున్నారు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని హైబ్రిడ్ మోడళ్లను తీసుకురావడానికి ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారత కొత్త హైబ్రిడ్‌ వాహన విధానం కోసం చూస్తున్నట్లు కంపెనీ ఆసియా పసిఫిక్‌ ప్రాంత డైరెక్టర్‌ ఫ్రాన్సెస్కో స్కాడావోనీ స్పష్టం చేశారు.