Ducati: భారతదేశంలో లాంచ్ అయ్యిన డుకాటీ డిజర్ట్ ఎక్స్ డిస్కవరీ.. ధర రూ. 21.78 లక్షలు..!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటలీకి చెందిన డుకాటీ సంస్థ భారత మార్కెట్లోకి కొత్త డిజర్ట్ ఎక్స్ డిస్కవరీ బైక్‌ను ఆవిష్కరించింది.
ఈ బైక్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.21.78 లక్షలుగా నిర్ణయించారు. ఇది ప్రధానంగా టూరింగ్ కోసం అనుకూలంగా రూపొందించిన వెర్షన్ అని కంపెనీ తెలిపింది.
ఇప్పటికే అందుబాటులో ఉన్న డిజర్ట్ ఎక్స్, ర్యాలీ మోడళ్లకు మధ్యస్థాయిలో డిస్కవరీ మోడల్‌ను తీసుకువచ్చినట్లు వెల్లడించారు.
దీన్ని సుదీర్ఘ ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా ప్రత్యేక ఫీచర్లతో రూపొందించారు. ఈ బైక్ బ్లాక్, వైట్, రెడ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
వివరాలు
అందుబాటులో కస్టమైజేషన్ ఆప్షన్
ఈ బైక్‌లో ఫ్యూయల్ ట్యాంక్ వద్ద బుల్ బార్ ప్రొటెక్షన్, పెద్ద విండ్‌స్క్రీన్, రేడియేటర్ గార్డ్, బెల్లీ గార్డ్, ఇంజిన్ బాష్‌ప్లేట్, సెంటర్ స్టాండ్, హార్డ్‌కేస్ పెన్నియర్స్ వంటి ప్రత్యేక హంగులను అందించారు.
అంతేకాకుండా, వినియోగదారులకు రీప్లేసబుల్ అంశాలు, కస్టమైజేషన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
ఈ బైక్‌లో స్మార్ట్‌ఫోన్లను కనెక్ట్ చేసుకునే ఐదు అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ ఉంది. అదనంగా, టర్న్ బై టర్న్ నావిగేషన్‌ను ఐదేళ్ల పాటు ఉచితంగా అందించనుంది.
వివరాలు
937 సీసీ ఎల్-ట్విన్ ఇంజిన్ శక్తి
హీటెడ్ గ్రిప్, అడ్జెస్టబుల్ 46 ఎంఎం యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ 320 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేకులు, 265 ఎంఎం వెనుక డిస్క్ బ్రేకులు అమర్చారు.
ఈ బైక్‌కు 937 సీసీ ఎల్-ట్విన్ ఇంజిన్ శక్తిని అందిస్తుంది. 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో ఇది పనిచేస్తుంది.
ఈ ఇంజిన్ గరిష్టంగా 108 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేయగలదు.
రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్, ఇంజిన్ బ్రేక్, క్రూజ్ కంట్రోల్, బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్స్ వంటి ఆధునిక ఫీచర్లను కూడా అందించాయి.