
Hero Splendor Plus : దసరా ఆఫర్.. ఈ బైక్ కొంటే 3 నెలల వరకు డబ్బులు ఇవ్వక్కర్లేదు!
ఈ వార్తాకథనం ఏంటి
పండుగ సీజన్ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించడానికి ఆటో మొబైల్ సంస్థలు సరికొత్త ఆఫర్లను ప్రవేశపెడుతున్నారు.
తాజాగా కస్టమర్ల కోసం ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్ గ్రాండ్ ఫెస్టివల్ ఆఫ్ ట్రస్టు అనే క్యాంపైన్‌ను ప్రారంభించింది.
ఈ ఆఫర్‌లో భాగంగా తమ 2 వీలర్ పోర్ట్ ఫోలియోలోని వాహనాలపై స్పేషల్ డిస్కౌంట్స్, బెనిఫిట్స్, ఫైనాన్షియల్ స్కీమ్ ను అందిస్తోంది. హీరో స్ల్పెండర్ ప్లస్ బైక్ బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ లో ఒకటి.
ఈ వెహికల్‌ని పండుగ సీజన్‌లో కొంటే ఈఐఎంలు మాత్రం 2024 నుంచి కట్టాలని ప్రకటించింది.
ముఖ్యంగా ఈ వాహనానికి 6.99 శాతం తక్కువ వడ్డీతో లోన్ కూడా ఇవ్వడం విశేషం.
Details
రూ.3వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్
ఇక రూ.3వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా ఇవ్వనుంది. అర్హత కలిగిన కస్టమర్లు, ఆధార్ ఆధారిత లోన్ స్కీమ్, క్యాష్ ఈఎంఐ ఆప్షన్ పొందే అవకాశం ఉంటుంది.
100-110 సీసీ సెగ్మెంట్లో ఈ హీరో స్ల్పెండర్ ప్లస్‌కు ఇంకా మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది.
ఇందులో 97.2 సీసీ, ఎయిర్-కూల్డ్, 4 స్ట్రోక్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు.
ఈ బైక్‌లో మొత్తం నాలుగు వేరియంట్లు ఉండనున్నాయి. ఇండియాలో వీటి ఎక్స్‌షోరూం ధరలు రూ. 75,141 నుంచి రూ. 77.986 మధ్యలో ఉన్నాయి.