
Hero e-scooter : హీరో నుంచి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బైక్.. లాంచ్ ఎప్పుడంటే
ఈ వార్తాకథనం ఏంటి
హీరో మోటోకార్ప్ కంపెనీ నుంచి వచ్చే వాహనాలకు వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది.
ఇప్పటికే ఆ కంపెనీ నుంచి అనేక మోడళ్ల ఈవీలు మార్కెట్లో సక్సెస్ అయ్యాయి.
తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తక్కువ ధరకే విడుదల చేయాలని ఆ కంపెనీ భావిస్తోంది.
2023-24 సంవత్సరానికి కంపెనీ వార్షిక నివేదికలో హోల్డర్లను ఉద్ధేశించి ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నిరంజన్ గుప్తా పేర్కొన్నారు.
Details
మార్కెట్ ను విస్తరించే పనిలో హీరో
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఈ ఏడాది తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
వీడా వీవన్ ప్లస్ ఆధారంగా దీన్ని తయారు చేస్తున్నట్లు తెలిసింది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా వాహన శ్రేణిని విస్తరించి తన మార్కెట్ ను మరింత విస్తరించాలని భావిస్తోంది.
ఈ కొత్త స్కూటర్‌కు చిన్న బ్యాటరీ ప్యాక్ అమర్చడం వల్ల గణనీయంగా ఖర్చు తగ్గే అవకాశం ఉంది.
దేశంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అనుకూలమైన ధరకే ఈ స్కూటర్లను అందించాలని హీరో కంపెనీ భావిస్తోంది.