Electric Scooter: తక్కువ ధరలో లభిస్తున్న EOX ZUKI ఎలక్ట్రిక్ బైక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం భారత మార్కెట్లో పలు కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఎగసిపోతుండటంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మరింతగా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో వివిధ రకాల ధరల్లో అనేక ఎలక్ట్రిక్ బైక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా మార్కెట్‌లో EOX ZUKI ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. భారతదేశంలో ఇప్పటికే అనేక రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడవుతున్నప్పటికీ, EOX ZUKI ప్రత్యేకత ఏమిటంటే.. దీన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడుస్తుందనే కారణంగా లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదని కంపెనీ స్పష్టం చేసింది.
వివరాలు
ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బైక్ 40 నుండి 50 కిలోమీటర్ల వరకు మైలేజ్
అలాగే, ఈ స్కూటర్‌ను ఈఎంఐ పద్ధతిలో తక్కువ నెలసరి చెల్లింపులతో కొనుగోలు చేయవచ్చని యాజమాన్యం తెలిపింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బైక్ 40 నుండి 50 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని, ఇది 48 వోల్ట్ లిథియం-అయాన్ బ్యాటరీతో నడుస్తుందని, అందులో ఛార్జర్ కూడా కలిపి వస్తుందని కంపెనీ వివరించింది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4 నుండి 6 గంటల సమయం పడుతుందని, దీన్ని సులభంగా తీయగలిగే విధంగా రూపకల్పన చేసినందున ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఈ బైక్ వాటర్, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను పాటించిందని ఆయన వెల్లడించారు.
వివరాలు
ధర విషయానికి వస్తే..
ఈ మోడల్‌లో ఎకో, స్పోర్ట్స్, హై అనే మూడు రకాల డ్రైవింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ధర విషయానికి వస్తే.. మార్కెట్‌లో దీని ధరను ₹59,999గా నిర్ణయించారు. అయితే అమెజాన్లో ఈ స్కూటర్‌ను 25 శాతం తగ్గింపుతో ₹44,999కే కొనుగోలు చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే సుమారు ₹3,000 వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుందని తెలిపింది. ఈఎంఐ పద్ధతిలో తీసుకుంటే నెలకు కేవలం ₹2,182 చెల్లించడమే సరిపోతుందని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది.