త్వరలో లెక్ట్రిక్స్ నుంచి ఎలక్ట్రికల్ స్కూటర్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. పూర్తిగా పర్యావరణ హితం కావడం, మంచి మైలేజీని సింగిల్ చార్జ్ తో అందిస్తుండటంతో అందరూ ఈ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో కొత్తగా లెక్ట్రిక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ కానుంది. లుమినోస్, లివ్‌గార్డ్, లివ్‌ఫాస్ట్, లివ్‌పూర్ వంటి బ్రాండ్ లకు ప్రసిద్ధి చెందిన ఎస్ఏఆర్ గ్రూప్ త్వరలో ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యాపారంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. జూలై 22 నుంచి లెక్ట్రిక్స్ నూతన ఎలక్రిక్ స్కూటర్ బుకింగ్ ను చూసుకొనే అవకాశం ఉంది. ఈ స్కూటర్ అధునాతన ఫీచర్లతో ముందుకు రానుంది.
లెక్ట్రిక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అధునాతన ఫీచర్లు
లెక్ట్రిక్స్ ఈ-స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ-స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. మార్కెట్లో దీని ధర రూ.1.5 లక్ష ఉండొచ్చని మార్కెట్లో అంచనాలు ఉన్నారు. లెక్ట్రిక్స్ ఈసిటీజిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 250W మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ లో 48V/24Ah లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. దీనిని 6-7 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ట్రాఫిక్ లో సులభంగా రైడ్ చేసే అవకాశం ఉంటుంది.