Loading...
Electric Tractors India: ట్రాక్టర్ల మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌.. ఎలక్ట్రిక్‌ మోడళ్లకు భారీ డిమాండ్
ట్రాక్టర్ల మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌.. ఎలక్ట్రిక్‌ మోడళ్లకు భారీ డిమాండ్

Electric Tractors India: ట్రాక్టర్ల మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌.. ఎలక్ట్రిక్‌ మోడళ్లకు భారీ డిమాండ్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 09, 2026
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వాహనం అంటే బైక్‌, స్కూటర్‌, కారు లేదా బస్సు గుర్తుకొచ్చేది. ఇప్పుడు ఆ జాబితాలో ట్రాక్టర్లు కూడా వేగంగా చేరుతున్నాయి. వ్యవసాయంతో పాటు పరిశ్రమల్లోనూ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల వినియోగానికి అవకాశాలు పెరుగుతుండటంతో ఈ రంగం కొత్త దశలోకి వెళ్తోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం తయారీ సంస్థలు ఏకంగా 40,000 యూనిట్ల వరకు ఉత్పత్తి సామర్థ్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చులు, ఇంధన వ్యయంతో పోలిస్తే వచ్చే ఆదా, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

Details

ప్రభుత్వ ప్రోత్సాహకాలతో మరింత ఊపు

ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహం ఇస్తోంది. Sub-Mission on Agricultural Mechanisation (SMAM) పథకంలో డీజిల్ ట్రాక్టర్లతో పాటు ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను కూడా సబ్సిడీ పరిధిలోకి తీసుకురావడం ఈ రంగానికి కీలక పరిణామంగా మారింది.

హర్యానా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఎలక్ట్రిక్ వ్యవసాయ యంత్రాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.

దీంతో రైతులకు ప్రారంభ పెట్టుబడి భారాన్ని కొంత తగ్గించే అవకాశం ఏర్పడుతోంది. ఈ విధానాలు కొనసాగితే గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Details

ఫ్యాక్టరీల్లోనూ ట్రాక్టర్లకు కొత్త పని

ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం మరోటి ఉంది. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు కేవలం పొలాల్లో పనిచేసే వాహనాలుగా కాకుండా పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది.

హైవేలపై కమర్షియల్ రిజిస్ట్రేషన్‌తో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను నడిపేందుకు అనుమతి కోరుతూ తయారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

అనుమతులు లభిస్తే సిమెంట్‌, చక్కెర, పేపర్‌, టైల్స్ తయారీతో పాటు FMCG కంపెనీల్లోనూ వీటి వినియోగం పెరగవచ్చు.

తక్కువ రన్నింగ్‌ ఖర్చు, సులభమైన నిర్వహణతో పరిశ్రమలకు ఇది మరో ఉపయోగకరమైన ప్రత్యామ్నాయంగా మారొచ్చు.

ADVERTISEMENT