Page Loader
EOS R6 Mark IIను లాంచ్ చేయబోతున్న Canon సంస్థ
EOS R6 Mark II కెమెరాతో మనాబు

EOS R6 Mark IIను లాంచ్ చేయబోతున్న Canon సంస్థ

వ్రాసిన వారు Nishkala Sathivada
Dec 22, 2022
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో వీడియో కంటెంట్ మార్కెట్ అభివృద్ధిచెందుతోంది. 2022లో OTT ఆదాయం $2 బిలియన్లు వచ్చాయి, రాబోయే మూడేళ్లలో $18 బిలియన్ల ఆదాయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్, మీడియా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, OTT ప్రొడక్షన్ హౌస్‌ల పెరుగుదలకు ఇది కూడా కారణం అయింది. ఈ నేపథ్యంలో వీడియో పరికరాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. పెరుగుతున్న ఈ డిమాండ్‌ను తీర్చడానికి, Canon ఇండియా సంస్థ వినియోగదారుల అవసరాలను తీర్చే వినూత్న ఉత్పత్తులపై పని చేస్తోంది. యువ ఫోటోగ్రాఫర్‌లు ఫ్రేమ్ మిర్రర్‌లెస్ కెమెరాలు వైపు మొగ్గు చూపుతున్నారు. క్రియేటర్స్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, Canon తన EOS R6 కెమెరా యొక్క తదుపరి వెర్షన్ Canon EOS R6 మార్క్ IIను ప్రారంభించింది.

Canon

ఇది నిపుణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన కెమెరా

EOS R6 మార్క్ IIలో సినిమాస్కోప్ యాస్పెక్ట్ మార్కర్, ఫాల్స్ కలర్ మానిటర్ వంటి ప్రొఫెషనల్ మానిటరింగ్ టూల్స్‌ ఉన్నాయి. సినిమాటిక్ ఫుటేజ్ కోసం అయితే 6K నుండి 60p వద్ద 4k వీడియో రిజల్యూషన్‌ను, 180p వద్ద పూర్తి HD వీడియో రిజల్యూషన్‌ను అందిస్తుంది. Canon ఇండియా ప్రెసిడెంట్ మనాబు మాట్లాడుతూ, ఇది ఇమేజ్ క్వాలిటీ, AF, డ్రైవ్, వీడియో పనితీరు వంటివి ఆలోచించే నిపుణుల కోసం కెమెరా అని. EOS R6 మార్క్ IIతో, 24.2 Megapixels, పూర్తి HD 180p రిజల్యూషన్‌తో సహా కెమెరాలో కొన్ని గేమ్-క్లూయింగ్ ఫీచర్‌లతో పరిశ్రమలో ట్రెండ్ సృష్టిస్తామని చెప్పారు.