Page Loader
EV Chargers: ఓలా, ఎథర్, హీరో, టీవీఎస్ కస్టమర్లకు డబ్బు రీఫండ్
కస్టమర్లకు డబ్బు రీఫండ్ చేయనున్న ఓలా, ఎథర్, హీరో, టీవీఎస్

EV Chargers: ఓలా, ఎథర్, హీరో, టీవీఎస్ కస్టమర్లకు డబ్బు రీఫండ్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 04, 2023
06:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓలా, ఎథర్, హీరో, టీవీఎస్ సంస్థలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈవీ చార్జర్ల కోసం కస్టమర్లు చెల్లించిన మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు ఆ సంస్థలు ముందుకొచ్చాయి. ఈవీ చార్జర్లను కంపెనీలను అధిక ధరలకు విక్రయించారని ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుకు సిద్ధమైంది. చార్జర్లకు ఎక్కువ డబ్బు వసూలు చేసిన కంపెనీలకు ఫేమ్ 2 కింద ఇవ్వాల్సిన ప్రోత్సహకాలను చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. దీంతో చార్జర్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు డబ్బు రీఫండ్ చేయాలని సంస్థలు నిర్ణయించుకున్నాయి. అయితే ఆ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థలు మళ్లీ ఫేమ్-2 ప్రోత్సహకాలను పొందే అవకాశం ఉంది.

Details

రూ.300 కోట్ల వరకు డబ్బు రీఫండ్

ఓలా ఎలక్ట్రిక్, ఎథెర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ దాదాపుగా రూ.300 కోట్ల వరకు డబ్బును రీఫండ్ చేయనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న కొందరు చార్జర్ల ధరలపై అనవసర రాద్దాంతం చేయడంతో ఈ అంశంపై తెరపైకి వచ్చిందని ఓలా ఎలక్ట్రిక్ స్పష్టం చేసింది. కొన్ని స్వార్థపూరితమైన గ్రూప్ ప్రయత్నాలను దాటుకొని దాదాపుగా రెండు సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోందని ఓలా పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ లక్షమంది కస్టమర్లకు రూ.130 కోట్లు, ఎథెర్ ఎనర్జీ 95 వేల మందికి 140 కోట్లు, టీవీఎస్ మోటర్ సూమారు రూ.18 కోట్ల మేర రీఫండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.