కియా మోటర్స్ నుంచి ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ కియా మోటర్స్ మరో నూతన ఎస్‌యూవీతో ముందుకు రానుంది. తాజాగా కియా ఈవీ5ని చైనాలో జరిగిన ఆటో షోలో ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ మోడల్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. చైనాలో కియా ఈవీ5 ఈ ఏడాది చివర్లో లాంచ్ కానున్నట్లు తెలిసింది. 2025 వరకు ఇండియాలో ఈ ఎస్‌యూవీ లాంచ్ కాకపోవచ్చు. ఈ సీఎంసీ ప్లాట్ ఫామ్ పై కియా సంస్థ దీనిని రూపొందిస్తోంది. కియా ఈవీ5 డిజైన్, కాన్సెప్ట్ వర్షెన్ ను పోలి ఉండనుంది. ముఖ్యంగా ఈవీ9 స్ఫూర్తితో దీన్ని రూపొందించినట్లు సమాచారం.
కియా ఈవీ5 బంపర్ లో కీలక మార్పులు
కియా ఈవీ5లో 21-ఇంచ్ ఫ్యూచరిస్టిక్ వీల్స్, షార్ప్-లుకింగ్ ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్స్ వంటివి రానున్నాయి. బంపర్ లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మిర్రర్స్ సైజ్ కొద్దిగా పెద్దగా ఉండే అవకాశం ఉంది. ఈ కియా ఈవీ5 ఎలక్ట్రిక్ వెహికల్ అనేది, కియా ఈవీ6కు మినీ వర్షెన్‌లో కనిపిస్తోంది. ఫ్రెంట్ డిజైన్ చాలా అగ్రెసివ్ గా ఉండటంతో కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఈవీ పొడవు 4,615ఎంఎం. వీల్‌బేస్ 2,750ఎంఎంగా ఉంది. ఇందులో సింగిల్ ఎలక్ట్రిక్ మోటర్ తో పాటు 212 బీహెచ్‌పీ పవర్‌ను, 310 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయనుంది. బ్యాటరీ ప్యాక్, రేంజ్ వంటి వివరాలపై సంస్థ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.