Tata Sierra:త్వరలో టాటా మోటర్స్ నుంచి సియెర్రా ఎస్‌యూవీ లాంచ్.. లీక్ అయిన ఫీచర్లు
ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం భారీగా పెరుగుతోంది. వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపడంతో ఆయా కార్ల తయారీ సంస్థలు ఎక్కువగా ఈవీల తయారీపై ఫోకస్ పెడుతున్నారు. దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వేగం పెంచింది. త్వరలో భారత మార్కెట్లోకి టాటా సియెర్రా ఎస్‌యూవీ రావడానికి సిద్ధంగా ఉంది. 2025లో ఈ ఈవీని లాంచ్ చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు తయారు చేశారు. ఈ ఎస్ యూవీకి సంబంధించిన ఫీచర్లు ఆన్ లైన్ లీకయ్యాయి. ప్రస్తుతం సియెర్రా ఫీచర్ల గురించి తెలుసుకుందాం. సియెర్రా ఎలక్ట్రిక్ వాహనం ఐసీఈ ఎంపికలో అందుబాటులో ఉంది.
వచ్చే ఏడాది టాటా సియెర్రా ఈవీ లాంచ్
టాటా సియెర్రాలో ఫ్రంట్ బంపర్, బ్రాడ్ గ్రిల్‌తో పాటు హెడ్‌ల్యాంప్ కాన్ఫిగరేషన్ ఉంది. గ్రిల్ పై హెడ్‌ల్యాంప్‌లను ప్రత్యేకంగా అమర్చారు. లైట్‌బార్, గ్రిల్‌కు మధ్య ఒక పెద్ద లోగోతో కనిపించింది. టాటా సియెర్రా EV వెనుక లగేజీ కంపార్ట్ మెంట్, విశాలమైన ఇంటీరియర్, సొగసైన షైనింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ కలిగి ఉంటుంది. ఈ టాటా సియెర్రా ఈవీ కోసం ఇప్పటికే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వచ్చే ఏడాది మార్కెట్‌లో లాంచ్ అయినప్పుడు ఈ ఈవీ గురించి అదనపు వివరాలు తెలిసే అవకాశం ఉంది.