LOADING...
అదరిపోయే వోల్వో ఈఎక్స్ 30 వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్ల ప్రయాణం
వోల్వో ఈఎక్స్ 30

అదరిపోయే వోల్వో ఈఎక్స్ 30 వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్ల ప్రయాణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2023
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

స్వీడన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఈఎక్స్ 30ఈవీ కారును ఈనెల 7న భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర దాదాపు 36,000 యూరోలు (సుమారు రూ.32 లక్షలు) ఉండనుంది. టెస్లా ప్రపంచవ్యాప్తంగా మరింత సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందించనుంది. వోల్వో ఈ ఏడాది చివర్లో చైనాలోని ఝాంగ్జియాకౌ ఫెసిలిటీలో EX30 తయారీని ప్రారంభించనుంది, వచ్చే ఏడాది డెలివరీలను ప్రారంభిస్తామని సంస్థ స్పష్టం చేసింది. వోల్వో EX30 3.4 సెకన్లలో 0నుంచి వందకిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు పర్యావరణ పరంగా, ప్రయాణ పరంగానూ సేప్టీ కారుగా నిలవనుంది. సిగ్నేచర్ థోస్ హమ్మర్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, స్లీక్ ఫ్రంట్ ప్రొఫైల్ విత్ వెర్టికల్లీ ఎల్ఈడీ టెయిల్ టైస్ కలిగి ఉంటుంది.

Details

వోల్వో ఈఎక్స్ 30లో 5 సీట్ల క్యాబిన్

వోల్వో EX30 రెండు విభిన్న బ్యాటర్ల ఆప్షన్లో వస్తోంది. ఎంట్రీ లెవల్ కారు 51 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, హై ఎండ్ వేరియంట్ 69 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. హై ఎండ్ ఎస్‌యూవీ కారు సింగిల్ చార్జింగ్‌తో 480 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. 5 సీట్ల క్యాబిన్, డ్యుయల్ టోన్ డాష్ బోర్డు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్ విత్ రేర్ ఏసీ వెంట్స్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉండనున్నాయి. ఇంకా ప్రయాణికుల భద్రత కోసం పలు ఎయిర్ బ్యాగులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్ తో రానుంది.