LOADING...
FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ ఈ హైవేలపై చెల్లదు.. ఎక్కడ చెల్లుంటుందంటే.. 
ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ ఈ హైవేలపై చెల్లదు.. ఎక్కడ చెల్లుంటుందంటే..

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ ఈ హైవేలపై చెల్లదు.. ఎక్కడ చెల్లుంటుందంటే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2026
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా టోల్ చెల్లింపుల్లో కొంత ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15న ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌ను ప్రవేశపెట్టింది. ప్రారంభంలో రూ.3,000గా ఉన్నఈ పాస్ ధర ప్రస్తుతం రూ.3,075గా ఉంది. ఈ పాస్ తో ఏడాదిలో గరిష్టంగా 200ట్రిప్స్ వరకు ఉపయోగించుకోవచ్చు. ఒక్క టోల్ గేట్ దాటితే అది ఒక ట్రిప్‌గా పరిగణిస్తారు.అయితే ఈ వార్షిక పాస్ అన్ని రహదారులపై చెల్లదు.కేవలం NHAI నిర్వహించే జాతీయ రహదారులు,ఎక్స్‌ప్రెస్‌వేలపైనే ఇది వర్తిస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో,పూర్వాంచల్,బుందేల్‌ఖండ్,యమునా,గంగా ఎక్స్‌ప్రెస్‌వేలు, మహారాష్ట్రలో ముంబై-నాగ్‌పూర్,ముంబై-పుణే, హర్యానాలో ట్రాన్స్-హర్యానా, కర్ణాటకలో బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేలపై ఈ పాస్ చెల్లదు. రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే రహదారులపై ఈ సౌకర్యం ఉండదు. అలాంటి చోట్ల వినియోగదారులు తమ ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ నుంచే టోల్ చెల్లించాల్సి ఉంటుంది.

వివరాలు 

తోలి నాలుగు రోజుల్లోనే 5 లక్షలకుపైగా వినియోగదారులు

ఇక NHAI పరిధిలో ఉన్న ప్రధాన జాతీయ రహదారులైన ఢిల్లీ-కొల్‌కతా (NH19),ఆగ్రా-ముంబై (NH3), నార్త్-సౌత్ కారిడార్ (NH48), పోర్బందర్-సిల్చర్ (NH27),ఈస్ట్రన్ కోస్ట్ (NH16), పుణే-మచిలీపట్నం (NH65), ఆగ్రా-బీకానేర్ (NH11), శ్రీనగర్-కన్యాకుమారి (NH44) వంటి మార్గాలపై ఈ పాస్ ఉపయోగించుకోవచ్చు. అలాగే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-మీరట్, చెన్నై-సేలం, ముంబై-సూరత్,అహ్మదాబాద్-వడోదర వంటి ముఖ్య ఎక్స్‌ప్రెస్‌వేలపైనా ఇది వర్తిస్తుంది. ఈ కొత్త FASTag వార్షిక పాస్‌కు మంచి స్పందన లభిస్తోంది. విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే 5 లక్షలకుపైగా వినియోగదారులు ఈ పాస్‌ను కొనుగోలు చేసినట్లు NHAI వెల్లడించింది. తమిళనాడు రాష్ట్రం అత్యధిక కొనుగోళ్లతో ముందంజలో ఉండగా, కర్ణాటక, హర్యానా తదుపరి స్థానాల్లో ఉన్నాయి. టోల్ ప్లాజాల్లో ఎక్కువగా లావాదేవీలు కూడా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదయ్యాయి.

Advertisement