Toyota: టయోటా FT-Se ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారులో అదిరిపోయే ఫీచర్స్.. ప్రత్యేకతలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
2023 జపాన్ మొబిలిటీ షోలో ఓ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని దిగ్గజ ఆటో మొబైల్ టాయోటా మోటార్ పరిచయం చేయనుంది.
ఈ స్పోర్ట్స్ ఈవీని తాజాగా ఆసంస్థ రిలీవ్ చేసింది. దాని పేరు టయోటా FT-se ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు.
ఏరోడైనమిక్ టూ-సీటర్, ప్రత్యేకమైక లుక్ తో ఆవిష్కరించారు. ఇది 100mm కంటే తక్కువ ఎత్తులో ఉన్న సెల్‌లను కలిగి ఉన్న అల్ట్రా-కాంపాక్ట్ బ్యాటరీ సిస్టమ్‌తో అమర్చారు.
FT-Se కాన్సెప్ట్ టయోటా, ఐకానిక్ MR2 స్పోర్ట్స్ కారు నుండి ప్రేరణ పొందింది.
ఇది 1980ల నుండి 2000ల ప్రారంభం వరకు మూడు తరాల వరకు విస్తరించింది.
కచ్చితమైన కొలతలు తెలియకపోయినా FT-Se విశాలంగా ఉంది. తఇది వర్చువల్ స్టిక్ షిఫ్ట్ సిస్టమ్‌ని ఉపయోగిస్తుంది
Details
FT-Se కాన్సెప్ట్ టయోటాలో ఫ్యూచరిస్టిక్ ఫీచర్స్
ఆటోమేకర్ డైనమిక్ డ్రైవింగ్ సమయంలో ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కింద మోకాలి ప్యాడ్‌లను అమర్చారు.
వర్చువల్ స్టిక్ షిఫ్ట్ సిస్టమ్‌తో EV స్పోర్ట్స్ కార్ ప్రోటోటైప్‌లో పనిచేస్తున్నట్లు కార్‌మేకర్ గతంలో ప్రకటించింది.
ఇందులో కేబిన్ చాలా స్పేషియస్గా ఉండనన్నట్లు సమాచారం. అనేక ఫ్యూచరిస్టిక్ ఫీచర్స్ దీని సొంతం అని మార్కెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఈ మోడల్‌కి సంబంధించిన ఫీచర్స్, మోటార్, రేంజ్‌తో పాటు లాంచ్ డేట్‌ను సంస్థ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే వీటిపై ఓ క్లారిటీ వస్తుంది.