Loading...
Fiat 500 Production Halt: కొనసాగుతున్న ఫియట్‌ 500 ప్లాంట్‌ ఉత్పత్తి నిలిపివేత...యూనియన్ల ఆందోళన
కొనసాగుతున్న ఫియట్‌ 500 ప్లాంట్‌ ఉత్పత్తి నిలిపివేత...యూనియన్ల ఆందోళన

Fiat 500 Production Halt: కొనసాగుతున్న ఫియట్‌ 500 ప్లాంట్‌ ఉత్పత్తి నిలిపివేత...యూనియన్ల ఆందోళన

వ్రాసిన వారు Balachander Sharma
Nov 13, 2026
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటలీలోని ట్యూరిన్‌లో ఉన్న స్టెల్లాంటిస్‌ చారిత్రక మిరాఫియోరి ప్లాంట్‌లో ఫియట్‌ 500 ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి మరో వారానికి పొడిగింది. నవంబర్‌ 16 నుంచి 20 వరకు ఫియట్‌ 500 ఉత్పత్తి లైన్లలో పనిచేసే ఉద్యోగులు ఫర్లాఫ్‌లోనే ఉంటారని కార్మిక సంఘాలు వెల్లడించాయి. దీంతో ఉత్పత్తి నిలిపివేత ఐదో వారంలోకి చేరింది.

Details

ఇతర విభాగాల్లో మాత్రం కార్యకలాపాలు

ఫియట్‌ 500 తయారీకి బ్రేక్‌ పడినా ప్లాంట్‌లోని అన్ని కార్యకలాపాలు ఆగిపోలేదు.

స్పెషల్‌ వెహికల్‌, ఆర్‌జీ ప్రీమియం, మసెరటి సంబంధిత పనులు కొనసాగనున్నాయి.

అంటే మొత్తం ప్లాంట్‌ మూసివేత కాకుండా, డిమాండ్‌ తక్కువగా ఉన్న ఫియట్‌ 500 ఉత్పత్తి విభాగంపైనే ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

Details

విడిభాగాల కొరత.. డిమాండ్‌ కూడా తగ్గింది

FIM-CISL యూనియన్‌కు చెందిన ఇగోర్‌ అల్బెరా రాయిటర్స్‌తో మాట్లాడుతూ ఉత్పత్తి నిలిచిపోవడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని చెప్పారు.

ఒకవైపు అవసరమైన విడిభాగాల కొరత ఉంటే, మరోవైపు ఫియట్‌ 500కు మార్కెట్‌లో డిమాండ్‌ బలహీనంగా ఉందని తెలిపారు.

2026లో మిరాఫియోరి ప్లాంట్‌ నుంచి 50,000కు కొద్దిగా ఎక్కువ కార్లు మాత్రమే తయారయ్యే అవకాశం ఉందన్న అంచనాలు కూడా విశ్వసనీయంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ADVERTISEMENT

Details

ఈ ఏడాదికి ఆర్డర్లు సరిపోతాయంటున్న యూనియన్

ప్రస్తుత ఆర్డర్‌ బుక్‌ను పరిశీలిస్తే ఈ ఏడాది చివరి వరకు రెండు వారాల పాటు ఉత్పత్తి కొనసాగినా సరిపోతుందని అల్బెరా చెప్పారు.

హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్‌ ఫియట్‌ 500 మోడళ్లకు ఉన్న ప్రస్తుత ఆర్డర్లను ఆ ఉత్పత్తితోనే పూర్తి చేయవచ్చని వివరించారు.

స్టెల్లాంటిస్‌ ప్రకారం ఇటలీలోని కొన్ని ప్లాంట్లలో తాత్కాలిక ఉత్పత్తి నిలిపివేతలు నవంబర్‌, డిసెంబర్‌లోనూ కొనసాగవచ్చు.

N3 GSE ఇంజిన్‌ కంట్రోల్‌ యూనిట్‌కు సంబంధించిన విడిభాగాల సరఫరాలో సమస్యే ఇందుకు కారణమని సంస్థ తెలిపింది.

ఉత్పత్తి షెడ్యూల్‌ను వారానికోసారి సమీక్షిస్తూ సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.

ADVERTISEMENT

Details

ఉద్యోగులపై పెరుగుతున్న ఒత్తిడి

తాజా పరిణామంపై యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ట్యూరిన్‌లో ఉత్పత్తి, ఉద్యోగాలపై అనిశ్చితి మరింత బలపడుతోందని పేర్కొన్నాయి.

తరచూ తాత్కాలిక లేఆఫ్‌లు రావడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యూనియన్‌ నేతలు తెలిపారు.

దీంతో మిరాఫియోరి ప్లాంట్‌ భవిష్యత్తుపై ఇప్పుడు ఉద్యోగుల్లోనూ, ఆటో రంగంలోనూ ఆసక్తి పెరిగింది.

ADVERTISEMENT