ఫియట్ తొలి ఈవీ కారు 600e గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా.. ధర తెలుసుకోండి
ఫియట్ కంపెనీ నుంచి వస్తున్న తొలి పూర్థిస్థాయి ఎలక్ట్రిక్ కారు త్వరలోనే ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో విడుదల కానుంది. ఈ మేరకు వచ్చే నెలల్లో ఫియట్ 600eని లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వచ్చే నెలలో యూకే(UK) ఆటో మార్కెట్‌లోకి రానుంది. కియా కేరెన్స్ EV, రానున్న వోల్వో EX30 వంటి వాహనాలతో ఫియట్ క్రాస్‌ఓవర్ కారు పోటీ పడనుంది. ఫియట్ కారు, 600e రెండు వేరియంట్‌లలో లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. 1. ఎంట్రీ లెవల్ రెడ్ ఎడిషన్ 2. టాప్-ఎండ్ లా ప్రైమా రెడ్ ఎడిషన్ ధరలు, ఆయా వాహనాల ఎంపిక, కొనుగోలుదారుడి బడ్జెట్, కోరుకున్న ఫీచర్‌లపై ఆధారపడి ఉంటాయని ఫియట్ కంపెనీ స్పష్టం చేసింది.
రెండు వేరియంట్‌లలో లభించనున్న ఫియట్ ఈవీ 600e
ఎలక్ట్రిక్ క్రాసోవర్ 360 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. ఇందులోని సెన్సార్‌లు డ్రైవర్ అప్రమత్తంగా ఉన్నారా లేదా అనేది గుర్తిస్తుంది. మరోవైపు లెవల్-టూ అసిస్టెడ్ డ్రైవింగ్ సహా అనేక భద్రతా ఫీచర్‌లను అందిస్తోంది. 54kWh బ్యాటరీని కలిగి ఉన్న ఫియట్ 600e, కంబైన్డ్ సైకిల్‌పై 402 కిమీ దూరం ప్రయాణిస్తుంది. ఒకే మోటారుతో, ఇది 154hp, 260Nm టార్క్‌ను అందిస్తుంది. UKతో పాటు ఎంపిక చేసిన షోరూమ్ లో 600e వాహనం అందుబాటులో ఉండనుంది. రెడ్ ఎడిషన్ ధరలు, డాలర్లు - 32,995 (రూ. 34 లక్షలు), టాప్ ఎండ్ మోడల్, లా ప్రైమా డాలర్లు 36,995 (రూ. 38.1 లక్షలు) వద్ద ప్రారంభం కానుంది.