Loading...
Skoda Slavia Facelift: స్కోడా స్లావియాకు ఫస్ట్‌ ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లు ఇవే!
స్కోడా స్లావియాకు ఫస్ట్‌ ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లు ఇవే!

Skoda Slavia Facelift: స్కోడా స్లావియాకు ఫస్ట్‌ ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2026
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

మూడున్నరేళ్లుగా మార్కెట్‌లో కొనసాగుతున్న స్కోడా స్లావియాకు తొలిసారిగా ఫేస్‌లిఫ్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది. మిడ్‌-సైకిల్‌ అప్‌డేట్‌లో భాగంగా స్వల్ప డిజైన్‌ మార్పులతో పాటు కొత్త ఫీచర్లు, అదనపు సౌకర్యాలు, కొత్త వేరియంట్‌ను స్కోడా తీసుకొచ్చింది. మిడ్‌సైజ్‌ సెడాన్‌ విభాగంలో కొనసాగుతున్న స్లావియా.. వోక్స్‌వ్యాగన్‌ విర్టస్‌, హోండా సిటీ, హ్యుందాయ్‌ వెర్నా వంటి మోడళ్లకు ప్రత్యక్ష పోటీదారుగా ఉంది.

వివరాలు

ఎక్స్‌టీరియర్‌లో మార్పులు

కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో బయటివైపు పలు మార్పులు చేశారు. ముందుభాగంలో రీడిజైన్‌ చేసిన బంపర్‌, క్రోమ్‌ ఫినిష్‌డ్‌ ట్రిమ్‌ స్ట్రిప్‌, చిన్న LEDఫాగ్‌ ల్యాంప్స్‌ ఉన్నాయి.

గ్రిల్‌ ఆకారం మాత్రం యథాతథంగా కొనసాగింది. అయితే గతంలో ఉన్న క్రోమ్‌ సరౌండ్‌ స్థానంలో బ్లాక్‌ బార్స్‌ ఇచ్చారు. హెడ్‌ల్యాంప్‌ హౌసింగ్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. కానీ లోపలి ఎలిమెంట్స్‌, డేటైమ్‌ రన్నింగ్‌ లైట్స్‌ సిగ్నేచర్‌ను కొత్తగా మార్చారు.

సైడ్‌ ప్రొఫైల్‌, కారు కొలతలు మునుపటి మోడల్‌ మాదిరిగానే ఉన్నాయి.అయితే కొత్త డిజైన్‌తో కూడిన 16-అంగుళాల టూ-టోన్‌ అల్లాయ్‌ వీల్స్‌ అందించారు.

వెనుక భాగంలో టెయిల్‌ ల్యాంప్‌ హౌసింగ్‌లు పాతవే కొనసాగినా.. LEDఇంటర్నల్స్‌ను అప్‌డేట్‌ చేశారు. బూట్‌ లిడ్‌పై ప్లాస్టిక్‌ ట్రిమ్‌తో 'SKODA' లెటరింగ్‌ను ఇచ్చారు.

వివరాలు

క్యాబిన్‌లో మరింత సౌకర్యం

అంతేకాకుండా ఆర్కిటిక్‌ సిల్వర్‌, కాపుచినో బేజ్‌ అనే రెండు కొత్త కలర్‌ ఆప్షన్లను జోడించారు. ఫేస్‌లిఫ్ట్‌ స్లావియా ఇంటీరియర్‌లోనూ కొన్ని కీలక మార్పులు చేసింది.

సీట్లకు పూర్తిగా బేజ్‌ కలర్‌ లెదరెట్‌ అప్‌హోల్‌స్టరీని కొత్త ప్యాటర్న్‌తో అందించారు. గత మోడల్‌లో ఉన్న బేజ్‌-బ్లాక్‌ డ్యూయల్‌ టోన్‌ డిజైన్‌ను తొలగించారు.

వెనుక కూర్చునే ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచేందుకు ఔటర్‌ సీట్లకు మసాజ్‌ ఫంక్షన్‌ అందించారు.

కూల్డ్‌ గ్లోవ్‌ బాక్స్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఆపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, LED యాంబియంట్‌ లైటింగ్‌ వంటి ఫీచర్లు కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

ఇంజిన్‌లో మార్పులు లేవు

భద్రత పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫేస్‌లిఫ్ట్‌ స్లావియాలో ఇంజిన్‌ ఆప్షన్లను మార్చలేదు. మునుపటి మాదిరిగానే 1.0 లీటర్‌, 1.5 లీటర్‌ TSI ఇంజిన్లు కొనసాగుతున్నాయి.

1.0 లీటర్‌ TSI ఇంజిన్‌ 115 హెచ్‌పీ పవర్‌, 178 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో పాటు కొత్తగా 8-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

ఇక 1.5 లీటర్‌ TSI ఇంజిన్‌ 150 హెచ్‌పీ పవర్‌, 250 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్‌ను 7-స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

ఎవరికి పోటీ?

కొత్త ఫేస్‌లిఫ్ట్‌తో స్కోడా స్లావియా మిడ్‌సైజ్‌ సెడాన్‌ విభాగంలో తన స్థానాన్ని కొనసాగించనుంది.

వోక్స్‌వ్యాగన్‌ విర్టస్‌, హోండా సిటీ, హ్యుందాయ్‌ వెర్నా వంటి మోడళ్లతో ఈ కారు నేరుగా పోటీ పడుతుంది.

స్వల్ప డిజైన్‌ మార్పులు, కొత్త ఫీచర్లు, మెరుగైన వెనుక సీటు సౌకర్యంతో కొత్త స్లావియా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

ADVERTISEMENT