Page Loader
Okaya Electric Scooter: ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు భారీగా తగ్గింపు.. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే
ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు భారీగా తగ్గింపు.. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే

Okaya Electric Scooter: ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు భారీగా తగ్గింపు.. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2024
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో ఈవీ వాహనాల వినియోగం విపరీతంగా పెరగడంతో టాప్ కంపెనీలు సరికొత్త ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈవీ స్కూటర్ కంపెనీ ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్లపై నమ్మలేని ఆపర్లను ప్రకటించింది. తాజాగా వాటిని ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఈవీ స్కూటర్ కొనుగోలుపై దాదాపు రూ. 31,000 వరకు తగ్గిస్తోంది.

Details

రూ.1 తో బుక్ చేసుకొనే అవకాశం

కస్టమర్లు ప్రత్యేక ఆఫర్ కింద ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని రూ.1కే బుక్ చేసుకొనే అవకాశాన్ని కల్పించింది. ఒకాయ ఆఫర్ కింద ఫ్రీడమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.78,557 ఉండగా, దాన్ని రూ.74,899కి తగ్గించింది. మరోవైపు, మోటోఫాస్ట్‌ను రూ. 1.54 లక్షలకు బదులుగా రూ. 1.29 లక్షలకు కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. అదేవిధంగా, ఫాస్ట్ F2B, ఫాస్ట్ F2T, ఫాస్ట్ F2F ధరలు వరుసగా రూ. 94,998, రూ. 94,998, రూ. 83,999 ఉన్నాయి.

Details

100శాతం ఫైనాల్స్ సౌకర్యం

కంపెనీ ఆఫర్ కింద 6.99 శాతం వడ్డీ రేటుతో 100 శాతం ఫైనాన్స్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. రూ. 2,999 ప్రారంభ EMIతో స్కూటర్‌ని ఇంటికి తీసుకెళ్లవచ్చని కంపెనీ తెలిపింది. Ferrato Disruptor ఎలక్ట్రిక్ బైక్‌పై Okaya ఈ ఆఫర్‌ను అందించడం లేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించిన ఈ మోటార్ సైకిల్ 129 కి.మీ. వరకు ప్రయాణించగలదు. దీని ధర రూ. 1.6 లక్షలు (ఎక్స్-షోరూమ్).