సరికొత్త ఫీచర్లతో ముందుకొస్తుస్న ఫోర్డ్ ఎఫ్-150.. ధర ఎంతంటే?
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి సరికొత్త కార్లను ప్రవేశపెడుతున్నాయి. ప్రస్తుతం కొన్ని బడా కంపెనీలు పోటీ పోటీగా సరికొత్త ఫీచర్లతో కార్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ఫోర్డ్ ఎఫ్-150 ను సరికొత్త ఫీచర్లతో తీర్చిదిద్దారు. ఇందులో డిజైన్, సాంకేతికను జోడించి 'ప్రో యాక్సెస్' అనే టేయిర్ గేట్ ను పొందుపర్చారు. ట్రక్‌లో రీడిజైన్ చేయబడిన హెడ్‌లైట్లు, కొత్త బంపర్, గ్రిల్ స్టైల్స్ అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఫోర్డ్ పాత 3.3-లీటర్ V6 ఇంజన్‌ను తొలగించారు. 2.7-లీటర్ ఎకోబూస్ట్ V6 మిల్లుతో భర్తీ చేయనుంది. ఇది 325hp శక్తిని, 542Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఫోర్డ్ ఎఫ్-150లో అధునాతన ఫీచరలు
2024 F-150 ప్లాటినం ప్లస్ ట్రిమ్‌కు స్మోక్డ్ ట్రఫుల్ ఇంటీరియర్ థీమ్‌ను, ఇతర ట్రిమ్‌ల కోసం మష్రూమ్ టోన్‌లతో అమర్చారు. ఎంట్రీ-లెవల్ F-150 XLగా మిగిలిపోవడం గమనార్హం. అయితే కొత్త ప్లాటినం ప్లస్ లిమిటెడ్‌ను ఫ్లాగ్‌షిప్ వేరియంట్‌గా ఇది భర్తీ చేసింది. ఈ వాహనం హెడ్స్-అప్ డిస్ప్లే, ప్రామాణిక LED హెడ్‌లైట్లు, ADAS ఫంక్షన్‌లను కూడా పొందుతుంది. గ్లోబల్ మార్కెట్‌లో దీని ధర $38,565 (సుమారు రూ. 31.96 లక్షలు) ఉండనుంది.