LOADING...
Hero Bikes: హీరో బైక్స్ & స్కూటర్లపై జీఎస్టీ బంపర్ ఆఫర్‌.. రూ. 15,700 వరకు తగ్గింపు!
హీరో బైక్స్ & స్కూటర్లపై జీఎస్టీ బంపర్ ఆఫర్‌.. రూ. 15,700 వరకు తగ్గింపు!

Hero Bikes: హీరో బైక్స్ & స్కూటర్లపై జీఎస్టీ బంపర్ ఆఫర్‌.. రూ. 15,700 వరకు తగ్గింపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2025
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆటోమొబైల్ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొత్త జీఎస్టీ శ్లాబుల అమలుతో వాహనాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో హీరో మోటోకార్ప్ తమ మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలు తగ్గుతాయని అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 22, 2025 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. మోడల్ వారీగా ఖచ్చితమైన ధరల జాబితా ప్రకటించనప్పటికీ, తగ్గింపులు గరిష్టంగా రూ. 15,743 వరకు ఉంటాయని హీరో వెల్లడించింది. అయితే ఇవి తాత్కాలిక లెక్కలు మాత్రమేనని, కంపెనీ తుది నిర్ణయంపై తగ్గింపుల్లో మార్పులు ఉండవచ్చని స్పష్టం చేసింది. హీరో మోటోకార్ప్‌కు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది.

Details

మోడల్ వారీగా గరిష్ట ధర తగ్గింపు లాభాలు

Destini 125 - ₹7,197, Glamour X - ₹7,813 HF Deluxe - ₹5,805 Karizma 210 - ₹15,743 Passion+ - ₹6,500 Pleasure+ - ₹6,417 Splendor+ - ₹6,820 Super Splendor XTEC - ₹7,254 Xoom 110 - ₹6,597 Xoom 125- ₹7,291 Xoom 160 - ₹11,602 Xpulse 210 - ₹14,516 Xtreme 125R - ₹8,010 Xtreme 160R 4V - ₹10,985 Xtreme 250R - ₹14,055

Details

సీఈఓ స్పందన

ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ సీఈఓ విక్రమ్ కస్బేకర్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన GST 2.0 సంస్కరణలను మేము స్వాగతిస్తున్నాం. ఈ మార్పులు వినియోగాన్ని పెంచుతాయి, దేశ GDP వృద్ధిని వేగవంతం చేస్తాయి. భారత్ \$5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకెళ్లే ప్రయాణాన్ని ఇది మరింత బలపరుస్తుంది. అదనంగా భారతీయ కుటుంబాలలో సగానికి పైగా ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను వాడుతున్నారు" అని అన్నారు. మొత్తం మీద జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది.