Page Loader
 Harley Davidson X 500 vs Royal Enfield Interceptor 650 :ఈ రెండు బెస్ట్ బైక్ ఇదే!
హర్లీ డేవిడ్ సన్, రాయల్ ఎన్ ఫీల్డ్

 Harley Davidson X 500 vs Royal Enfield Interceptor 650 :ఈ రెండు బెస్ట్ బైక్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2023
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎక్స్ 500 బైకును సరికొత్తగా అంతర్జాతీయ మార్కెట్లోకి హార్లీ డేవిడ్ సన్ ప్రవేశపెట్టింది. క్యూజే మోటర్ కొలాబరేషన్‌లో వస్తున్న ఆల్ న్యూ నియో రైట్రో బైక్ రెండోది కావడం విశేషం. అయితే రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 బైక్ కూడా నూతన టెక్నాలజీలో మార్కెట్లోకి రావడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఈ రెండు బైక్ లో ఏ బైక్ బెస్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 500వ మాస్య్కులర్ ఫ్యూయెల్ ట్యాంక్, సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, ఓవల్ షేప్ మిర్రర్స్, సింగిల్ పీస్ స్టెప్డ్ అప్ సీట్, సైడ్ మౌంటెడ్ డబుల్ బారెల్ ఎగ్సాస్ట్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్ తో కూడినసెక్షన్ వంటి ఫీచర్స్ తో రానుంది.

Details

బైక్స్ ధర, వివరాలు

హర్లీ డేవిడ్ సన్ బైక్ఎత్తు 820 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 153ఎంఎం, వీల్ బేస్ 1,458ఎంఎం, కర్బ్ వెయిట్ 208కేజీలు ఉంది. ఇక రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650లో టియర్ డ్రాప్ షేప్డ్ ఫ్యూయెల్ ట్యాంక్, రౌండ్ ఎల్ఈడీ హెడ్ లైట్, రైజ్‌డ్ హ్యాండిల్ బార్, సింగిల్ పీస్ సీట్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్ లభిస్తున్నాయి. ఈ బైక్ ఎత్తు 804ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 174ఎంఎం, వీల్ బేస్ 1398ఎంఎ ఉండగా.. కర్బ్ వెయిట్ 218 కేజీలు ఉంది. రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650ఎక్స్ షోరూం ధర రూ.3.03లక్షలు నుంచి 3.31 లక్షల మధ్యలో ఉండనుంది. ఇక ఎక్స్ 500 రూ.5.28 లక్షలుగా ఉండనుంది.