Kawasaki Ninja 400 కంటే Yamaha YZF-R3 ఫీచర్స్ సూపర్బ్
జపనీస్ మార్క్ యమహా వచ్చే నెలలో ఇండియాలో సూపర్‌స్పోర్ట్ YZF-R3ని మళ్లీ కొత్త ఫీచర్స్‌తో ప్రవేశపెట్టనుంది. ముందు వచ్చిన బైక్ ట్రాక్-ఫోకస్డ్ ఆఫర్ కారణంగా విమర్శలను ఎదుర్కొంది. ప్రస్తుతం ఆల్ రౌండ్ సబ్-400cc మోటార్‌సైకిల్‌గా రానుంది. Yamaha YZF-R3లో 14-లీటర్ ఇంధనట్యాంక్, డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్‌లు, క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్, స్ప్లిట్-టైప్ సీట్లు, నిటారుగా ఉండే విండ్‌స్క్రీన్, సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్, LED టైల్‌లైట్‌తో కూడిన సొగసైన టెయిల్ సెక్షన్ ఉన్నాయి. కవాసకి నింజా 400లో ట్విన్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, నిటారుగా ఉండే విండ్‌స్క్రీన్, క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, 14-లీటర్ మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్, ఎల్‌ఈడీ టెయిల్లాంప్ ఉండడం దీని ప్రత్యేకత. ఈ రెండు బైక్‌లు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడవనున్నాయి.
Yamaha YZF-R3 ధర రూ.4.51 లక్షలు
Yamaha YZF-R3 2,090mm పొడవు, 730mm వెడల్పు, 1,140mm ఎత్తు కలిగి ఉంది. కవాసకి నింజా 400 మొత్తం పొడవు 1,990mm, వెడల్పు 710mm, ఎత్తు 1,120mm ఉండనుంది. భద్రత కోసం,Yamaha YZF-R3, కవాసకి నింజా వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉన్నాయి. ఇండియాలో కవాసకి నింజా 400 ధర రూ. 5.14 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా.. యమహా YZF-R3 US మార్కెట్‌లో సుమారు రూ. 4.51 లక్షలు)గా ఉంది. YZF-R3 చూడటానికి ఆకర్షణీయంగా. పెద్ద కొలతలు, మెరుగైన భద్రతతో ఉన్నందున ఈ బైక్ ఉత్తమైనది చెప్పొచ్చు.