హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 వర్సెస్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్.. ఇందులో బెస్ట్ బైక్ ఇదే!
హార్లీ డేవిడ్ సన్ కంపెనీ నుంచి అత్యంత చౌకైన బైక్‌గా హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 400 గుర్తింపు పొందింది. ఈ హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 ఎక్స్‌షోరూం ధర రూ. 2.29లక్షలుగా ఉంది. ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమలయన్‌కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్‌లో అంచనాలున్నాయి. ఈ క్రమంలో ఈ రెండింట్లో ఏదీ బెస్ట్ అప్షనో ఇప్పుడు తెలుసుకుందాం. హర్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైకులో 13.5 లీటర్ స్కల్పెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‌లైట్, వైడ్ హ్యండిల్బార్, ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్, స్టెప్ అప్ సీట్, స్లీక్ ఫెండర్ మౌంటెడ్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, సైడ్ మౌంటెడ్ ఎగ్సాస్ట్, మెషిన్డ్ వీల్స్ వస్తున్నాయి.
ఈ రెండు బైక్స్‌లో ఇంజిన్ వివరాలివే
ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌లో 15 లీటర్ స్లోపింగ్ ఫ్యూయెల్ ట్యాంక్, సర్క్యులర్ హెడ్‌ల్యాంప్, రైజ్డ్ హ్యాండిల్‌బార్, అప్రైట్ విండ్‌స్క్రీన్, స్ప్లిట్ స్టైల్ సీట్స్, అప్స్వెప్ట్ ఎగ్సాస్ట్, వయర్ స్పోక్డ్ వీల్స్ లభిస్తున్నాయి. ఎక్స్440లో సరికొత్త 440సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ వస్తోంది. మరోవైపు హిమాలయన్ బైక్‌లో 411సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 ఎక్స్‌షోరూం ధర రూ. 2.29లక్షలు- రూ. 2.69లక్షల మధ్యలో ఉండగా.. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎక్స్‌షోరూం ధర రూ. 2.16లక్షలు- రూ. 2.28లక్షల మధ్యలో ఉంది.