
Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ స్థానంలో ఉన్న టాటా మోటార్స్, ఇప్పుడు తన విద్యుత్ వాహన శ్రేణిలో మరో కొత్త మోడల్ 'హారియర్ EV'ను విడుదల చేయేందుకు సిద్ధమవుతోంది.
ఆధునిక టెక్నాలజీ, బలమైన నిర్మాణం, ఆకర్షణీయమైన డిజైన్‌లతో వినియోగదారుల మనసు గెలుచుకున్న టాటా, ఇప్పటికే నెక్సన్ EV ద్వారా ఈ విభాగంలో మంచి మార్క్ వేసింది.
ఇప్పుడు హారియర్ EVతో మరింత దూసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.టాటా మోటార్స్ తాజా ప్రకటన ప్రకారం, హారియర్ EVని 2025 జూన్ 3న అధికారికంగా మార్కెట్లోకి తీసుకురానున్నారు.
ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఈ మోడల్‌ను ప్రదర్శించారు. అప్పట్లో దీని డిజైన్‌ను బహిర్గతం చేసినా, టెక్నికల్ వివరాలు మాత్రం కంపెనీ గోప్యంగా ఉంచింది.
Details
ప్లాట్‌ఫారమ్, ఆర్కిటెక్చర్ వివరాలు
హారియర్ EV టాటా OMEGA ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించారు. ఇదే ప్లాట్‌ఫారమ్ డీజిల్ వేరియంట్‌కు కూడా ఉపయోగిస్తున్నారు.
అయితే, EV వెర్షన్ కోసం ఛాసిస్, ఫ్లోర్ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక మార్పులు చేయడంతో బ్యాటరీలు, ఎలక్ట్రిక్ కాంపోనెంట్ల అమరిక సులభమైంది. దీన్ని 'Acti.ev (Gen 2) ఆర్కిటెక్చర్'గా టాటా అభివర్ణిస్తోంది.
AWD, భారీ టార్క్ ఊహాగానాలు
ప్రస్తుతం అధికారికంగా స్పెసిఫికేషన్స్ బయట పెట్టనప్పటికీ, ఈ వాహనంలో 'AWD సెటప్' ఉండే అవకాశం ఉందని ఆటో పరిశ్రమలో చర్చ జరుగుతోంది.
అలాగే, CURVV EV కంటే పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉండనుందని అంచనాలు ఉన్నాయి. దీని వల్ల సుమారు 500 Nm టార్క్ ఉత్పత్తి అయ్యే అవకాశముంది.
Details
విలక్షణమైన బాహ్య డిజైన్
హారియర్ డీజిల్ మోడల్ డిజైన్‌ను ఆధారంగా తీసుకుని కొన్ని ప్రత్యేక EV లక్షణాలను టాటా చేర్చింది.
ఇందులో:
వెర్టికల్ LED హెడ్‌లైట్స్
బ్లేడ్ ఆకారంలో DRLs
బ్లాక్‌డ్-అవుట్ D-పిల్లర్
ఫ్లోటింగ్ రూఫ్‌లైన్
వెనుక బంపర్లో వర్టికల్ LED ఫాగ్ లైట్స్
17" నుండి 19" సైజ్ వీల్స్
క్రోమ్ ట్రిమ్‌డ్ ఎయిర్ డ్యామ్
సిల్వర్ బాడీ క్లాడింగ్ ".EV" డోర్ బ్యాడ్జింగ్
"HARRIER.EV" టైల్గేట్ బ్యాడ్జింగ్
Details
అంతర్గత ఫీచర్లు - ఆధునికతతో నిండిన క్యాబిన్
హారియర్ EV లో ఇంటీరియర్ డిజైన్ డీజిల్ వేరియంట్‌కు దగ్గరగా ఉంటుంది. ఇందులో:
ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
నాలుగు స్పోక్ స్టీరింగ్ వీల్
డ్యుయల్-టోన్ డాష్‌బోర్డ్
టచ్ ఆధారిత HVAC కంట్రోల్స్
ప్యానోరామిక్ సన్‌రూఫ్
జూన్ 3న అధికారిక లాంచ్‌కు ముందుగానే ఈ మోడల్‌పై వినియోగదారుల్లో, ఆటో పరిశ్రమలో ఆసక్తి పెరిగిపోతోంది. టాటా మోటార్స్ ఈ మోడల్‌తో EV మార్కెట్లో మరింత ప్రభావాన్ని చూపనుందని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.