
Driving licence renewal: డ్రైవింగ్ లైసెన్స్ గడువు అయిపోయిందా..?ఇంటి నుంచే లైసెన్స్ రెన్యూవల్ చేసుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరం. అయితే చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత దాన్ని రెన్యూవల్ చేయడం మర్చిపోతుంటారు.
గడువు మించిపోయిన తర్వాత 30 రోజుల్లోపు రెన్యూవల్ చేయకపోతే జరిమానా తప్పదు. ఎక్కువ రోజులు ఆలస్యం చేస్తే జరిమానాతో పాటు కొత్తగా లైసెన్స్ తీసుకోవాల్సి రావచ్చు.
ఈ విధంగా అదనపు ఖర్చులు పడకుండా ఉండాలంటే, గడువు పూర్తయ్యే సమయానికే రెన్యూవల్ చేసుకోవడం ఉత్తమం.
ఇందుకోసం ఇప్పుడు ఇక ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. దళారుల వశం కాకుండా, మొబైల్ ద్వారా సులభంగా లైసెన్స్ రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో తెలుసుకుందాం.
Details
మొబైల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయడం ఇలా
1. ముందుగా రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్ (https://parivahan.gov.in) లోకి వెళ్ళండి.
2. అక్కడ "లైసెన్స్" ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. తదుపరి పేజీలో "డ్రైవింగ్ లైసెన్స్" ఎంపిక చేయాలి.
4. ఆ తర్వాత కనిపించే ఆప్షన్లలో Renewal of Driving Licence పై క్లిక్ చేయండి.
5. ఆపై Click Here to Book the Slot అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
6. ఓ కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో Driving Licence బాక్స్‌లో "Renewal of Licence" ఎంచుకుని "Continue Slot Booking"పై క్లిక్ చేయాలి.
7. తదుపరి పేజీలో మరోసారి "Renewal of Licence" ఆప్షన్ ఎంచుకోవాలి.
Details
మొబైల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయడం ఇలా1/2
8. అప్పుడే ఓ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, లైసెన్స్ ఇచ్చిన ఆర్‌టిఒ కార్యాలయం, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ తదితర వివరాలు నమోదు చేయాలి.
9. అనంతరం Request OTP పై క్లిక్ చేస్తే, మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అదే OTP క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి Get Details పై క్లిక్ చేయాలి.
10. మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని ధృవీకరించి Confirm చేయాలి.
11. తదుపరి దశలో మీకు నచ్చిన తేదీని సెలెక్ట్ చేసి Next పై క్లిక్ చేయండి.
details
మొబైల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయడం ఇలా1/3
12. ఇక పేమెంట్ ఆప్షన్ లో మీరు చెల్లించాల్సిన మొత్తం చూపిస్తుంది. మీకు అనువైన పేమెంట్ మోడ్ ఎంచుకుని చెల్లించాలి.
13. స్లాట్ బుకింగ్ పూర్తవుతుంది. దాని ప్రింట్ తీసుకుని ఎంచుకున్న తేదీన మీ అసలైన లైసెన్స్, గుర్తింపు కార్డులతో ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి.
14. అక్కడ మీ దస్త్రాలు పరిశీలించి, అవసరమైన ప్రాసెస్ పూర్తి చేసి లైసెన్స్ రెన్యూవల్ చేస్తారు.