Year Ender 2024: ఈ ఏడాది యువతను కట్టిపడేసిన టాప్ 5 బైక్‌లివే.. ఇందులో మీ ఫేవరెట్ మోడల్ ఉండొచ్చు!
2024లో వాహన రంగంలో కొత్త వాతావరణం క్రియేట్ చేస్తూ, బైకుల తయారీ కంపెనీలు పాత స్టైల్ బైక్‌లను ఆధునిక ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకువచ్చాయి. వాటిలో రెట్రో-శైలి బైక్‌లు ప్రత్యేకంగా యూత్‌కి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఏడాది కొన్ని గొప్ప రెట్రో-శైలి బైక్‌లు భారత మార్కెట్లో విడుదలై భారీగా ఆదరణ పొందాయి. వాటిలో టాప్ 5 రెట్రో-స్టైల్ బైకుల గురించి తెలుసుకుందాం 1.రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తన ప్రసిద్ధ బైక్‌లను మరింత నూతన ఫీచర్లతో విడుదల చేస్తోంది. 1960ల బైక్ డిజైన్‌కు సంబంధించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 బైక్ 2024లో మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ యూత్‌కి ఆకర్షణీయంగా ఉంటుంది.
2. ట్రయంఫ్ స్పీడ్ T4
ట్రయంఫ్ కంపెనీ తన మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు ఈ ఏడాది స్పీడ్ T4ను లాంచ్ చేసింది. ప్రత్యేక డిజైన్‌తో, ట్రయంఫ్ స్పీడ్ D4, స్పీడ్ 400 మోడళ్లను కూడా విడుదల చేసింది. ఈ బైక్‌లు పండగ సీజన్లో భారీ అమ్మకాలను సాధించాయి. 3. రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 బైక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ బైక్ క్లాసిక్ 350కు ఆధారంగా తయారు చేశారు. 349 సీసీ J-సిరీస్ ఇంజిన్‌తో రన్ అయ్యే ఈ బైక్ ధర రూ.2.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ప్రారంభమైంది.
4. BSA గోల్డ్ స్టార్ 650
బ్రిటిష్ బైకుల తయారీ కంపెనీ BSA గోల్డ్ స్టార్ 650ను, పాత డిజైన్‌ను ఆధునిక ఫీచర్లతో విడుదల చేసింది. 650 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో కూడిన ఈ బైక్ రాబోయే కాలంలో మరింత మంది బైక్ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. 5. జావా 42 fj జావా సంస్థ స్టైలిష్ బైక్‌లను రూపొందించడంలో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ ఏడాది జావా 42 fjను విడుదల చేసింది. ఇది 334 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీనిలో అంతర్జాతీయంగా బాగా డిమాండ్ ఉన్న లగ్జరీ బైక్‌ల లుక్‌ను కలిగి ఉంటుంది. ఈ రెట్రో-శైలి బైక్‌లు ఆధునిక టెక్నాలజీతో తయారైనప్పటికీ, పాత కాలపు క్లాసిక్ డిజైన్ అభిమానులను ఆకర్షిస్తున్నాయి.