Page Loader
ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్ కోసం హీరోతో చేతులు కలిపిన జీరో
హీరో సెప్టెంబర్ 2022లో $60 మిలియన్ల పెట్టుబడి పెట్టింది

ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్ కోసం హీరోతో చేతులు కలిపిన జీరో

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 06, 2023
08:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వదేశీ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహన ప్రపంచాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తుంది. ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌ల అభివృద్ధి కోసం అమెరికాకు చెందిన జీరో మోటార్‌సైకిల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. జీరో సంస్థ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు, పవర్‌ట్రెయిన్‌లను నిర్మించడంలో ప్రసిద్ది చెందింది. హీరో వాహనాల తయారీ, సోర్సింగ్, మార్కెటింగ్ స్థాయి వంటి అంశాలను చూసుకుంటుంది. హీరో ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీదారు ఇప్పుడు తన వ్యాపారాన్ని భవిష్యత్తుకు అనుకూలంగా ఉండటానికి ఎలక్ట్రిక్ బైక్ విభాగంలోకి ప్రవేశించాలనుకుంటోంది. జీరో మోటార్‌సైకిల్స్‌తో కలిసి నిర్మించినున్నప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌లు విజయవంతమైతే, అవి హార్లే-డేవిడ్‌సన్ వంటి బ్రాండ్‌ల మోడల్స్ తో పోటీ పడతాయి.

బైక్

హీరో సెప్టెంబర్ 2022లో $60 మిలియన్ల పెట్టుబడి పెట్టింది

సెప్టెంబర్ 2022లో, హీరో మోటోకార్ప్ కాలిఫోర్నియాకు చెందిన ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీసంస్థలో $60 మిలియన్ల (దాదాపు రూ. 491 కోట్లు) వరకు ఈక్విటీ పెట్టుబడి పెట్టింది. అయితే ఈ బైక్‌ల రకాలను, నిర్మించబోయే వివరాలను వెల్లడించలేదు. అవి లాంచ్ అయ్యేటప్పుడే తెలిసే అవకాశం ఉంది. జీరో మోటార్‌సైకిల్స్‌తో భాగస్వామ్యం మొబిలిటీ స్పేస్‌లో స్థిరమైన క్లీన్ టెక్నాలజీ యుగంలోకి ప్రవేశించే దిశగా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయని హీరో మోటోకార్ప్ చైర్‌పర్సన్ సిఇఒ పవన్ ముంజాల్ అన్నారు. జీరో మోటార్‌సైకిల్స్ సిఈఓ సామ్ పాషెల్ మాట్లాడుతూ హీరో మోటోకార్ప్‌ను భాగస్వామిగా చేర్చుకున్నందుకు సంతోషిస్తున్నాము. మా కంపెనీలు రెండు రైడింగ్ అనుభవాన్ని మార్చి ప్రపంచానికి విశేషమైన, వినూత్న ఉత్పత్తులను అందిస్తాయి అందజేస్తాయని అన్నారు.