హీరో Xoom vs హోండా Dio ఏది కొనుక్కోవడం మంచిది
హీరో MotoCorp భారతదేశంలో సరికొత్త Xoom మోడల్‌ను ప్రారంభించింది. స్పోర్టీ స్కూటర్ భారతదేశంలో 110సీసీ విభాగంలో హోండా Dioతో పోటీపడుతుంది. హీరో Xoom సెగ్మెంట్-ఫస్ట్ 'కార్నర్ బెండింగ్ లైట్స్'తో వస్తే, హోండా Dio 109.5cc ఇంజిన్ పై నడుస్తుంది. హీరో MotoCorp భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన బ్రాండ్, ఈ బ్రాండ్ వాహనాలు ఎక్కువగా సబ్-150cc స్కూటర్, మోటార్‌సైకిల్ విభాగాలలో పోటీ పడుతుంటాయి. అయితే, ప్రస్తుతం హోండా యాక్టివా, Dio ఎక్కువగా అమ్ముడవుతున్న ఈ ఎంట్రీ-లెవల్ 110cc స్కూటర్ సెగ్మెంట్ లో ఇప్పటివరకు ఈ రెండిటికి హీరో సంస్థ గట్టి పోటీని ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన Xoom మోడల్‌తో అమ్మకాలలో ఈ రెండిటిని వెనక్కి నెట్టాలని ప్రయత్నిస్తుంది.
కార్నర్ లైట్లు, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో హీరో Xoom స్కూటర్ మెరుగ్గా ఉంటుంది
హీరో Xoom స్టార్ట్/స్టాప్ టెక్నాలజీతో 110.9cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ తో నడుస్తుంది. హోండా Dio Activa 6G సింగిల్-సిలిండర్ ఇంజన్ సపోర్ట్ తో నడుస్తుంది. రైడర్ భద్రత కోసం, హీరో Xoom ఫ్రంట్ వీల్‌పై డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ తో వస్తుంది. హోండా Dio రెండు చక్రాలపై డ్రమ్ బ్రేక్ తో వస్తుంది. భారతదేశంలో, హీరో జూమ్ ధర రూ. 68,599 నుండి రూ. 76,699 ఉంటుంది. హోండా Dio రూ. 68,625 నుండి రూ. 74,626 ఉంటుంది. (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). అయితే Hero Xoom కార్నర్ లైట్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు శక్తివంతమైన ఇంజన్ తో ధరకు మరింత విలువను ఇస్తుంది.