
Best Mileage Bike: అద్భుతమైన మైలేజీ, తక్కువ ధరలో అందరి ప్రియమైన కమ్యూటర్ బైక్!
ఈ వార్తాకథనం ఏంటి
హీరో HF డీలక్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారతదేశంలోని ప్రతి కుటుంబంలో ఈ బైక్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా భారత మార్కెట్‌లో కమ్యూటర్ బైక్‌లకు భారీ ఆదరణ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. తక్కువ ధర, అత్యధిక మైలేజీ, నమ్మకమైన పనితనం వంటి కారణాలతో ఇవి ప్రాచుర్యం పొందాయి. ఈ మార్కెట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన కమ్యూటర్ బైక్‌లలో ఒకటి హీరో HF డీలక్స్ బైక్. హీరో HF డీలక్స్ బైక్ 97.2 cc సామర్థ్యంలోని ఇంజిన్‌తో అందుబాటులో ఉంటుంది. ఇది 8,000 RPM వద్ద గరిష్టంగా 5.9 Kw పవర్‌ను, 6,000 RPM వద్ద 8.05 Nm టార్క్‌ను సృష్టిస్తుంది.
వివరాలు
హీరో HF డీలక్స్ బైక్ ధర
ఈ బైక్‌లో 4-స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చబడి ఉంది. హీరో మోటోకార్ప్ అధికారిక ప్రకటన ప్రకారం,ఇది ARAI సర్టిఫైడ్‌గా లీటరుకు సుమారు 68 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అయితే, అనేక వినియోగదారుల అనుభవాలు ప్రకారం, ఇది 70 కి.మీ వరకు మైలేజీ ఇచ్చే సామర్థ్యం కలిగి ఉంది. హీరో HF డీలక్స్ బైక్ ధర పరంగా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది మొత్తం 5 వేరియంట్లలో మార్కెట్లో లభిస్తోంది: ఆల్ బ్లాక్ OBD2P వేరియంట్ ధర: ₹60,738 కిక్ కాస్ట్ OBD2P వేరియంట్ ధర: ₹64,860 సెల్ఫ్ కాస్ట్ OBD2P వేరియంట్ ధర: ₹70,508 i3S కాస్ట్ OBD2P వేరియంట్ ధర: ₹72,008 టాప్ వేరియంట్ ప్రో OBD2P ధర: ₹74,290
వివరాలు
వేరియంట్లను బట్టి తగ్గింపు
ఈ ధరలు హీరో మోటోకార్ప్ అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్స్-షోరూమ్ ఆధారంగా ప్రకటించబడ్డాయి. సెప్టెంబర్ 22 తర్వాత ఈ బైక్ ధరల్లో భారీ తగ్గింపు కూడా రావాల్సివుంది. జీఎస్టీ తగ్గింపు కారణంగా వీటిలో గరిష్టంగా ₹5,805 వరకు ధర తగ్గనుంది.వేరియంట్లను బట్టి తగ్గింపు మారవచ్చు. అందుకే మీ సమీప హీరో మోటోకార్ప్ అధికృత డీలర్‌ను సంప్రదించి తాజా ధర వివరాలు తెలుసుకోవడం ఉత్తమం. హీరో HF డీలక్స్ బైక్ మంచి మైలేజీతో పాటు, సరసమైన ధరలో అందుబాటులో ఉండడం వల్ల వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది.
వివరాలు
డీలర్‌షిప్‌లు ప్రత్యేక ఆఫర్‌లు
ప్రత్యేకించి ఈ సంవత్సరం దీపావళి పండుగ సీజన్ దగ్గరపడిన నేపథ్యంలో, డీలర్‌షిప్‌లు ప్రత్యేక ఆఫర్‌లు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి. GST పన్ను తగ్గింపు, దీపావళి ఆఫర్‌ల కలయిక రాబోయే పండుగ సీజన్‌లో కొత్త వాహన కొనుగోలుదారులను ఆనందంతో ముంచెత్తుతుంది.