Hero MotoCorp: యూకే మార్కెట్లో హీరో XPulse 200 4V, XPulse 200 Pro బైక్‌లు లాంచ్
ఈ వార్తాకథనం ఏంటి
హీరో మోటోకార్ప్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో XPulse 200 4V, XPulse 200 Pro అడ్వెంచర్ బైక్‌లను అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటికే ఇటలీ, స్పెయిన్ వంటి యూరప్ దేశాల్లో అడుగుపెట్టిన హీరో.. ఇప్పుడు యూకే మార్కెట్లో కూడా తన ప్రస్థానాన్ని మరింత బలపరచే దిశగా ఈ కొత్త బైక్‌లను తీసుకొచ్చింది. యూకేలో ప్రముఖ ఆఫ్‌రోడ్ రైడింగ్ ప్రాంతమైన రిబుల్ వ్యాలీలోని Inch Perfect Trials వద్ద ఈ బైక్‌లను ఆవిష్కరించారు. అడవుల మధ్య ట్రైల్స్, చిన్న వాగులు, కఠినమైన ఆఫ్‌రోడ్ మార్గాలు ఉండటంతో అడ్వెంచర్ బైక్‌ల సామర్థ్యాన్ని చూపించేందుకు ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశారు.
వివరాలు
తక్కువ స్పీడ్‌లో కూడా మెరుగైన పనితీరు
ఈసందర్భంగా హీరో మోటోకార్ప్ సీఈఓ హర్షవర్ధన్ చితాలే మాట్లాడుతూ.. XPulse బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. రోజువారీ ప్రయాణాలతో పాటు ఆఫ్‌రోడ్ రైడింగ్ ఇష్టపడే వారికి కూడా ఈ బైక్‌లు సరైన ఎంపికగా నిలుస్తాయని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రపంచస్థాయి ఉత్పత్తులతో మరింత విస్తరణపై కంపెనీ దృష్టి పెట్టిందన్నారు. XPulse 200 4V,XPulse 200 Pro బైక్‌లలో 199.6సీసీ సింగిల్ సిలిండర్,4వాల్వ్,ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.ఈఇంజిన్ 8,500 RPM వద్ద 18.9 BHP పవర్,6,500 RPM వద్ద 17.35 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. తక్కువ స్పీడ్‌లో కూడా మెరుగైన పనితీరు ఇవ్వడంతో పాటు లాంగ్ టూరింగ్‌కు అనువుగా ట్యూనింగ్ చేసినట్లు హీరో తెలిపింది.
వివరాలు
మూడు ABS మోడ్‌లు
ఈ రెండు బైక్‌లలో కూడా రోడ్, ఆఫ్‌రోడ్, ర్యాలీ అనే మూడు ABS మోడ్‌లు ఉన్నాయి. రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా బ్రేకింగ్‌ను సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్ బై టర్న్ నావిగేషన్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, LED DRLs, బాష్ ప్లేట్, హ్యాండ్‌గార్డ్స్, లగేజ్ ప్లేట్ వంటి ఫీచర్లు కూడా అందించారు. స్టాండర్డ్ XPulse 200 4V బైక్‌ను నగర ప్రయాణాలు, లైట్ ట్రైల్ రైడింగ్‌కు అనువుగా రూపొందించారు. ఇందులో 825 mm సీట్ హైట్, 220 mm గ్రౌండ్ క్లియరెన్స్, 190 mm సస్పెన్షన్ ట్రావెల్‌తో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉన్నాయి. దీని ధర 2,499 పౌండ్లు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు.
వివరాలు
దేశవ్యాప్తంగా 36 సేల్స్, సర్వీస్ కేంద్రాలు
మరోవైపు XPulse 200 Pro బైక్‌ను ఎక్కువ ఆఫ్‌రోడ్ సామర్థ్యం కోరుకునే రైడర్ల కోసం తీసుకొచ్చారు. ఇందులో అడ్జస్టబుల్ సస్పెన్షన్, 250 mm ఫ్రంట్ ట్రావెల్, 220 mm రియర్ ట్రావెల్, 270 mm గ్రౌండ్ క్లియరెన్స్, హ్యాండిల్‌బార్ రైజర్స్, ఆఫ్‌రోడ్ బూట్లకు అనువైన ఎక్స్‌టెండెడ్ గేర్ లీవర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ సీట్ హైట్ 891 mm కాగా, ధర 2,699 పౌండ్లు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. యూకేలో హీరో బైక్‌ల విక్రయాలు, సర్వీస్ బాధ్యతలను MotoGB నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 36 సేల్స్, సర్వీస్ కేంద్రాల ద్వారా ఈ బైక్‌లు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే రెండు బైక్‌లపై 2 సంవత్సరాల వారంటీ కూడా కంపెనీ ప్రకటించింది.