NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Hero Splendor EV : హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్.. 2027 కల్లా మార్కెట్‌లోకి తీసుకొచ్చేలా ప్లానింగ్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Hero Splendor EV : హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్.. 2027 కల్లా మార్కెట్‌లోకి తీసుకొచ్చేలా ప్లానింగ్
    హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్.. 2027 కల్లా మార్కెట్‌లోకి తీసుకొచ్చేలా ప్లానింగ్

    Hero Splendor EV : హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్.. 2027 కల్లా మార్కెట్‌లోకి తీసుకొచ్చేలా ప్లానింగ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 16, 2025
    02:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీలలో ఒకటైన హీరో మోటోకార్ప్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో తన దృష్టిని సారించింది.

    ప్రస్తుతం కంపెనీ వద్ద ఎలక్ట్రిక్ వాహనాల పైగా విభిన్న ఆప్షన్లలో "విడా వి1" అనే ఒక్క మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది.

    అయితే,ఈ రంగంలో ఒలా ఎలక్ట్రిక్, బజాజ్ ఆటో, టీవీఎస్, ఏథర్ ఎనర్జీ వంటి అనేక ప్రముఖ కంపెనీలు పనిచేస్తున్నాయి.

    ఈ విధంగా చూస్తే,ఈవీ విభాగంలో హీరో మోటోకార్ప్ మరింత వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది.

    అందుకే,కంపెనీ ఈ విభాగంలో కొత్తగా ప్రవేశించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటోంది.

    రానున్న 2-3 సంవత్సరాల్లో 6కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఇందులో ఎంట్రీ లెవెల్ బైకులు, స్కూటర్లు కూడా ఉంటాయని చెప్పబడుతుంది.

    వివరాలు 

    2027లో ఈ మోడల్‌ను లాంచ్ చేయాలని కంపెనీ యోచన 

    అలాగే, దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

    ఈ ప్రాజెక్టును కూడా హీరో తమ ఎలక్ట్రిక్ వాహన ప్రాజెక్టులో భాగంగా తీసుకెళ్లింది.

    జైపూర్‌లోని టెక్నాలజీ సెంటర్ సీఐటీలో ఈ ప్రోడక్టును గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

    2027లో ఈ మోడల్‌ను లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ప్రాజెక్టుకు "ఏఈడీఏ" అని పేరుపెట్టారు.

    ఈ మోడల్ విడుదలయ్యాక ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల యూనిట్లను విక్రయించాలనుకుంటోంది. స్ప్లెండర్ ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్ సైకిల్.

    వివరాలు 

     రెండు మోడళ్లను"ఏడీజెడ్ఏ" ప్రాజెక్ట్ కింద రూపొందిస్తారు

    తదుపరి, 2026లో 10,000 యూనిట్ల వార్షిక అమ్మకాలతో "విడా లింక్స్"అనే ఎలక్ట్రిక్ బైకును తీసుకురావాలని కంపెనీ ఆశిస్తున్నది.

    ఈ మోడల్ ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో పరిచయం చేయబడతుందని భావిస్తున్నారు.

    2027లో, కొరడిన వాహనాలు, అభిప్రాయాలను బట్టి,ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు విడుదల చేయాలనే నిర్ణయానికి కంపెనీ తీసుకురానున్నది.

    "ఏఈడీఏ"ప్రాజెక్టు ముఖ్యంగా కమ్యూటర్ సెగ్మెంట్, రోజువారీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేయబడుతోంది.

    అలాగే, 150 సీసీ,250 సీసీ ఐసీ ఇంజిన్ వాహనాలకు సమానంగా మరొక రెండు మోడళ్లను"ఏడీజెడ్ఏ" ప్రాజెక్ట్ కింద రూపొందించబడతాయని తెలుస్తోంది.

    ఈ మోడళ్లు ముఖ్యంగా యువ రైడర్లకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడతాయి.

    2027-28 నాటికి,ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునే లక్ష్యంతో హీరో ఈ ప్రాజెక్టులను అమలు చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హీరో మోటోకార్ప్‌

    తాజా

    Raviteja : పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రవితేజ,కిషోర్ తిరుమల మూవీ  రవితేజ
    Sachin Tendulkar: ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం.. సంతాపం వ్యక్తం చేసిన స‌చిన్‌ సచిన్ టెండూల్కర్
    Bengaluru Stampede: RCB విజయోత్సవ కార్యక్రమంలో బెంగళూరులో తొక్కిసలాటకు దారితీసిన కారణాలివేనా? బెంగళూరు
    Gold Rate: పసిడి కొనుగోలుదారులకు ఊహించని షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. బంగారం

    హీరో మోటోకార్ప్‌

    హ్యార్లీ-డేవిడ్సన్‌ ఎక్స్‌440 ధర భారీగా పెంపు.. నేడు కొంటే రూ.10వేలు తగ్గింపు! హ్యార్లీ-డేవిడ్సన్‌ ఎక్స్‌440
    హీరో కరిజ్మా 'XMR 210' మోడల్ బైక్ విడుదల తేదీ, ఫీచర్లు ఇవే  తాజా వార్తలు
    Hero Karizma XMR 210: కొత్త బైక్ కోసం చూస్తున్నారా? ఒకసారి 'ఎక్స్ఎంఆర్ 201' బైక్‌పై ఓ లుక్కేయండి  తాజా వార్తలు
    Hero Splendor Plus : దసరా ఆఫర్.. ఈ బైక్ కొంటే 3 నెలల వరకు డబ్బులు ఇవ్వక్కర్లేదు! ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025