న్యూ లుక్‌తో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
న్యూ లుక్ తో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ బైక్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. గత మోడల్ కన్నా అప్‌డేటెడ్ వెర్షన్తో ఇది లాంచ్ అయింది. ఎక్స్ పల్స్ 200 4వీని విడుదల చేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ మంగళవారం ధ్రువీకరించింది. 2023లో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ బైక్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. అలాగే కొత్తగగా ఎక్స్ పల్స్ 200 4వీ ప్రో వెరియంట్ ను కూడా తీసుకొచ్చింది. ఈ సీసీ అడ్వెంచర్ బైకులో ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ ఇ20 ఇంజిన్ తో రానుంది. ఈ కొత్త ఎక్స్ పల్స్ 200 4వీ వెర్షన్ బైక్ కు మూడు ఏబీఎస్ మోడ్ లను హీరో మోటోకార్ప్ యాడ్ చేయడం విశేషం.
ఎక్స్ పల్స్ 4వీ బైక్ ఎక్స్ షోరూం ధర రూ. 1,43,516
అదే విధంగా రోడ్, ఆప్-రోడ్, ర్యాలీ మోడ్స్ ఉండనున్నాయి. ఎక్స్‌పల్స్ 200 4వీ ప్రో వేరియంట్ మరింత హార్డ్ కోర్ వెర్షన్‍గా ముందుకొచ్చింది. 250mm ఫుల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్, 220mm రేర్ స్పెన్షన్‍ను ఈ ప్రో బైక్ కలిగి ఉండడం గమనార్హం. సీట్ హైట్ 850mm, గ్రౌండ్ క్లియరెన్స్ 270mmగా ఉంటుంది. హ్యాండిల్ బార్ కాస్త ఎత్తుగా ఉంది. 2023 హీరో ఎక్స్ పల్స్ 4వీ బైక్ ఎక్స్ షోరూం ధర రూ. 1,43,516గా ఉంది. హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ ప్రో వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.1,50,891గా ఉంది.