Page Loader
కేటీఎం 390 అడ్వెంచర్​ వచ్చేసింది.. లాంచ్ ఎప్పుడంటే? 
2023 కేటీఎం 390 అడ్వెంచర్​ లాంచ్​

కేటీఎం 390 అడ్వెంచర్​ వచ్చేసింది.. లాంచ్ ఎప్పుడంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 15, 2023
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కేటీఎం 390 అడ్వెంచర్ 2023 వర్షెన్ లాంచ్ చేసింది. ఇది 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ ఎక్స్ వేరియంట్లతో పాటు 2023 కేటీఎం 390 అడ్వెంచర్ ని సంస్థ విక్రయించనుంది. ఈ మోడల్ ఎక్స్ షో రూం ధర రూ.3.60 లక్షలు ఉండనుంది. ఈ మోడల్ లో స్పోక్ వీల్స్ తో పాటు ఫుల్లీ అడ్జస్టెబుల్ సస్పెషన్ కొత్తగా రానున్నాయి. కేటీఎం 390 అడ్వెంచర్ బైక్ ను లాంచ్ చేసి దాదాపు 3 ఏళ్లు అయింది. ప్రస్తుతం రైడ్ క్వాలిటీ, హ్యాండ్లింగ్, కంఫర్ట్ పెంచుకొనే విధంగా ఈ బైక్ ను కస్టమైజ్ చేసుకొనే అవకాశం ఉంది.

Details

కేటీఎం 390 అడ్వెంచర్ ఫుల్ డిమాండ్

2023 కేటీఎం 390 అడ్వెంచర్ లో 19 ఇంచ్ ఫ్రెంట్, 17 ఇంచ్ రేర్ లైట్ స్పోక్డ్ వీల్స్ రానున్నాయి. బ్లాక్ అనోడైజ్డ్ అల్యుమీనియం రీమ్స్ వల్ల అడ్వెంచర్ రైడ్స్ మరింత స్మూత్ గా ఉండనుంది. టెక్నాలజీ పరంగా ఈ అడ్వెంచర్ బైక్ లో ట్రాక్షన్ కంట్రోల్ విత్ 3డీ ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్, క్విక్ షిఫ్టర్+, రైడ్ బై వయర్ వంటి మోడ్స్ తో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. 5 ఇంచ్ కలర్ టీఎఫ్‌టీ డిస్ ప్లే, హ్యాండిల్ బార్ స్విఛ్ గేర్‌లతో ఎంతో ప్రత్యేకంగా రూపొందించారు. ఈ బైక్ కు మంచి గుర్తింపు రావడంతో డిమాండ్ కూడా ఎక్కువగా లభిస్తోందని సంస్థకు చెందిన అధికారులు వెల్లడించారు.