భారత మార్కెట్‌లోకి 'ఈప్లూటో 7జీ ప్రో'.. ధర తక్కువ, రేంజ్ ఎక్కువ!
ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ సంస్థ వ్యూర్ ఈవీ భారత్ మార్కెట్లోకి ఈప్లూటో 7జీ ప్రో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ కన్నా ఇది చౌకగా లభించనుంది. సరికొత్త ఫీచర్లు, అధునాతన టెక్నాలజీతో ఈ స్కూటర్ రాబోతోంది. మాట్ బ్లాక్, గ్రే వైట్ రంగుల్లో ఈ బైక్ అందుబాటులో ఉండనుంది.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.94,999 గా ఉండనుంది. ప్యూర్ ఈవీ డీలర్ షిప్ షోరూంలో ఈ స్కూటర్ ను బుక్ చేసుకుంటే ఈ నెల చివర్లో డెలివరీ చేస్తామని సంస్థ వెల్లడించింది. ఈకోడ్రిప్ట్ మోటర్ సైకిల్ ప్లాట్ ఫార్మ్ పై ఈ స్కూటర్ ను ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో 3.0 కేడబ్ల్యూహెచ్ ఏఐఎస్ సర్టిఫైడ్ బ్యాటరీ లభించనుంది.
ఒక్కసారి ఛార్జీ చేస్తే 100-150 కిలోమీటర్లు
ముఖ్యంగా స్మార్ట్ బీఎంఎస్, బ్లూటూత్ కనెక్టివీటి సైతం రానుంది. 1.5కేడబ్య్లూ ఎలక్ట్రిక్ మోటార్ ఇందులో ఉండనుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100-150 కిలోమీటర్లు ప్రయాణించనుది. ఈవీలో ఉన్న మూడు మోడ్స్ బట్టి దీని రేంజ్ మారే అవకాశం ఉంటుంది. తమ బెస్ట్ సెల్లింగ్ 7జీ మోడల్ కు ఇది అప్ గ్రేడెడ్ వర్షెన్ అని, ప్రీలాంచ్ కు ముందే ఈ ఈవిపై 5వేల మంది ఆసక్తి చూపించడం సంతోషంగా ఉందని ప్యూర్ ఈవీ కో-ఫౌండర్, సీఈఓ రోహిత్ వదేరా పేర్కొన్నారు. అదే విధంగా ఒకినావా, అంపేరే, హీరో ఎలక్ట్రిక్ కు ఈ ఈప్లూటో 7జీ ప్రో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.